Sonia Gandhi : అక్టోబ‌ర్ 2 నుంచి కాంగ్రెస్ పాద‌యాత్ర

ప్ర‌క‌టించిన ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ

Sonia Gandhi : రాజ‌స్థాన్ లోని ఉద‌య్ పూర్ లో జ‌రిగిన న‌వ్ సంక‌ల్ప్ చింత‌న్ శివిర్ లో ఆదివారం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు ఏఐసీసీ తాత్కాలిక అధ్య‌క్షురాలు సోనియా గాంధీ(Sonia Gandhi). 2024 ఎన్నిక‌ల్లో విజ‌యమే ల‌క్ష్యంగా ముందుకు సాగుతామ‌న్నారు.

అక్టోబ‌ర్ 2 గాంధీ జ‌యంతి రోజున కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో ప్ర‌జా పాదయాత్ర చేప‌డ‌తామ‌న్నారు. ఆ యాత్ర కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేప‌డ‌తార‌ని, ఈ యాత్ర కాశ్మీర్ నుంచి క‌న్యాకుమారి వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు.

దేశంలోని ప్ర‌తి రాష్ట్రంలో క‌నీసం 90 కిలోమీట‌ర్లు క‌లిసేలా ప్లాన్ చేయ‌డం జ‌రిగింద‌న్నారు. ఇవాళ ఆఖ‌రి రోజు కావ‌డంతో ప‌లు కీల‌క నిర్ణ‌యాల‌కు ఆమోదం తెలిపింది కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ.

ఈ పాద‌యాత్ర‌కు భార‌త్ జోడో యాత్ర అని నామ‌క‌ర‌ణం చేసిన‌ట్లు ప్ర‌క‌టించారు సోనియా గాంధీ(Sonia Gandhi). త‌న కుటుంబంతో సాయంత్రం గ‌డిచిన‌ట్లు అనిపించింద‌న్నారు. అన్నింటిని తాము అధిగమిస్తామ‌న్నారు.

అదే మా సంకల్పం అని స్ప‌ష్టం చేశారు. తామంతా సామూహిక ప్ర‌యోజ‌నం కోసం తిరిగి శ‌క్తిని పొందుతామ‌న్నారు. మ‌నంద‌రం ఈ యాత్ర‌లో పాల్గొంటాం.

ఒత్తిడిలో ఉన‌న సామాజిక సామ‌ర‌స్య బంధాల‌ను బ‌లోపేతం చేయ‌డం, దాడికి గుర‌వుతున్న మ‌న రాజ్యాంగం పునాది విలువ‌ల‌ను ప‌రిర‌క్షించేందుకు ఈ యాత్ర కొన‌సాగుతుంద‌న్నారు.

కోట్లాది మంది ఎదుర్కొంటున్న ఆందోళ‌న‌ల‌ను ఎత్తి చూపేందుకు ప్ర‌య‌త్నిస్తామ‌న్నారు. జిల్లా స్థాయి జ‌న్ జాగ‌ర‌ణ అభియాన్ జూన్ 15న పునః ప్రారంభ‌మ‌వుతుంద‌ని సోనియా గాంధీ ప్ర‌క‌టించారు.

ఈ విస్తృత ప్ర‌చారం ఆర్థిక స‌మ‌స్య‌ల‌ను ప్ర‌ధానంగా పెరుగుతున్న నిరుద్యోగం, జీవ‌నోపాధిని నాశ‌నం చేస్తున్న ధ‌ర‌ల పెరుగుద‌ల‌ను హైలెట్ చేస్తుంద‌న్నారు.

అంత‌ర్గ‌త సంస్క‌ర‌ణ‌ల ప్ర‌క్రియ‌ను న‌డిపేందుకు కాంపాక్ట్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు సోనియా గాంధీ వెల్ల‌డించారు. ఒక స‌ల‌హా బృందాన్ని కూడా ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు తెలిపారు.

Also Read : భార‌త్ కు స్వర్ణం దేశానికి గ‌ర్వ‌కార‌ణం

Leave A Reply

Your Email Id will not be published!