TSSPDCL JOBS : హమ్మయ్య నోటిఫికేషన్ విడుదల
టీఎస్ఎస్పీడీసీఎల్ లో 1201 పోస్టులు
TSSPDCL JOBS : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించి తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) నోటిఫికేషన్(TSSPDCL JOBS) విడుదల చేసింది. ఈ మేరకు 1201 జాబ్స్ భర్తీ చేయనుంది.
ఇందులో భాగంగా 201 సబ్ ఇంజనీర్ పోస్టులు, జూనియర్ లైన్ మెన్ పోస్టులు 1000 భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది.
జనరల్ రిక్రూట్మెంట్ లో 447 పోస్టులకు, లిమిటెడ్ కోటాలో 553 పోస్టులను భర్తీ చేయనుంది.
ఇక జూనియర్ లైన్ మెన్ పోస్టులకు ఈనెల 19 నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. వచ్చే నెల జూన్ 17న రాత పరీక్ష చేపడుతుంది.
ఇక సబ్ ఇంజనీర్ పోస్టులకు జూన్ 15 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంది.
జూలై 31న రాత పరీక్ష నిర్వహిస్తుంది తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ(TSSPDCL JOBS). అర్హులైన అభ్యర్థులు టీఎస్ సదరన్ పవర్. సీజీజీ.ఓఆర్జీ.గవ్.ఇన్ వెబ్ సైట్ ను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది సంస్థ.
ఈ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల, నారాయణపేట, రంగారెడ్డి, వికారాబాద్ , మేడ్చల్ , మల్కాజిగిరి, సిద్దిపేట, మెదక్ , హైదరాబాద్ జిల్లాల్లో ఈ పోస్టులు ఉన్నాయి.
అప్లై చేసుకునే వారు రూ. 200 ఆన్ లైన్ లో దరఖాస్తు చేసేందుకు ఫీజు చెల్లించాలి. దాంతో పాటు రూ. 120 పరీక్ష ఫీజు కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఈడబ్ల్యుఎస్ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదని సంస్థ తెలిపింది.
కానీ వీరంతా ఆన్ లైన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జూనియర్ లైన్ మెన్ పోస్టుకు 10వ తరగతి, ఐటీఐలో ఎలక్ట్రికల్ ట్రేడ్ , వైర్ మెన్ లేదా ఇంటర్ ఒకేషనల్ కోర్సు చేసి ఉండాలి. 2022 జనవరి 1 నాటకి 18 నుంచి 35 ఏళ్ల లోపు ఉండాలి.
ఇతర వర్గాలకు 5 ఏళ్ల సడలింపు ఇచ్చింది. ఇక సబ్ ఇంజనీర్ పోస్టులకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ , ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్స ఇంజనీరింగ్
డిప్లొమా లేదా డిగ్రీ కలిగి ఉండాలి. 2022 జనవరి 1 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
Also Read : ఎక్సైజ్..రవాణా శాఖలో పోస్టుల భర్తీకి ఓకే