BAN vs SL 1st Test : ఏంజెలో మాథ్యూస్ డుబుల్ సెంచరీ మిస్
199 పరుగుల వద్ద ఔటైన 12వ క్రికెటర్
BAN vs SL 1st Test : బంగ్లాదేశ్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో శ్రీలంక(BAN vs SL 1st Test) ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ ఊహించని రీతిలో 199 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. కేవలం ఒకే ఒక్క పరుగు దూరంలో డబుల్ సెంచరీ మిస్ అయ్యాడు.
ప్రపంచంలో ఇప్పటి వరకు టెస్టు మ్యాచ్ లలో ఔట్ కావడం 12వ ఆటగాడు. బంగ్లాదేశ్(BAN vs SL 1st Test) తో జరిగిన తొలి టెస్టులో
శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్ లో 397 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మాథ్యూస్ 200 చేయక పోవడం బాధాకరం.
ఇప్పటి వరకు 11 మంది 199 రన్స్ వద్ద వికెట్ పారేసుకున్నారు. సోమవారం చటోగ్రామ్ లోని జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టెస్టులో ఈ ఘటన చోటు చేసుకుంది.
మాథ్యూస్ ఔట్ అయిన చివరి బ్యాటర్ కావడం విశేషం. ఈ క్రమంలో శ్రీలంక టెస్టు క్రికెట్ చరిత్రలో 199 రన్స్ వద్ద ఔట్ అయిన ఆటగాడిగా నిలిచాడు.
బంగ్లాదేశ్ తరపున స్పిన్నర్ నయీమ్ హసన్ 105 పరుగులు ఇచ్చి ఆరు కీలక వికెట్లు పడగొట్టాడు.
ఇక 199 పరుగుల వద్ద ఔట్ అయిన ఆటగాళ్లలో చూస్తే 1984లో పాకిస్తాన్ వర్సెస్ ఇండియాతో జరిగిన మ్యాచ్ లో పాక్ కు చెందిన ముదస్సర్ నాజర్ 199 రన్స్ వద్ద ఔట్ అయ్యాడు.
1986లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో భారత జట్టుకు చెందిన మణికట్టు మాంత్రికుడిగా పేరొందిన మహమ్మద్ అజహరుద్దీన్ 199 పరుగుల వద్ద వెనుదిరిగాడు.
1997లో ఆస్ట్రేలియా , ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో మాథ్యూ ఇలియట్ , 1997లో భారత్ తో జరిగిన మ్యాచ్ లో శ్రీలంక తరపున
జయసూర్య 199 రన్స్ వద్ద వెనుదిరిగారు. 1999లో విండీస్ తో జరిగిన మ్యాచ్ లో ఆసిస్ తరపున ఆడిన స్టీవ్ వా 199 వద్దే ఆగి పోయాడు.
2006లో భారత్ తో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ కు చెందిన యూనిస్ ఖాన్ , సౌతాఫ్రికా వర్సెస్ ఇంగ్లండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో
ఇయాన్ బెల్ 199 వద్ద ఔట్ అయయారు.
ఇక 2015లో జరిగిన విండీస్, ఆసిస్ మధ్య మ్యాచ్ లో స్టీవ్ స్మిత్ , 2016లో ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో ఇండియా తరపు
నుంచి కేఎల్ రాహుల్ , 2017లో దక్షిణాఫ్రికా, బంగ్లా దేశ్ తో జరిగిన మ్యాచ్ లో డీన్ ఎల్గర్ 199 వద్ద ఔట్ అయ్యారు.
2020లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో సఫారీ తరపున డుప్లెసిస్ 199 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు.
Also Read : కోహ్లీ..రోహిత్ ఆట తీరుపై గంగూలీ కామెంట్