DC vs PBKS IPL 2022 : పంజాబ్ కింగ్స్ కు ఢిల్లీ బిగ్ షాక్
ప్లే ఆఫ్ రేసులో నిలిచిన క్యాపిటల్స్
DC vs PBKS IPL 2022 : ఐపీఎల్ 2022 రసవత్తరంగా మారింది. నువ్వా నేనా అన్న రీతిలో సాగిన లీగ్ మ్యాచ్ లో ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ కింగ్స్(DC vs PBKS IPL 2022) పై ఘన విజయాన్ని నమోదు చేసింది. 17 పరుగుగల తేడాతో గెలుపొందింది.
ఈ విక్టరీతో ఢిల్లీ తన ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. 160 పరుగుల టార్గెట్ తో మైదానంలోకి దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 142 రన్స్ కే పరిమితమైంది.
జట్టులో జితేష్ శర్మ ఒక్కడే టాప్ స్కోరర్ గా నిలిచాడు. 44 పరుగులు చేసి రాణించగా మిగతా ప్లేయర్లు ఎవరూ ఆకట్టుకోలేక పోయారు. కీలక గేమ్ లో ఆడాల్సిన శిఖర్ ధావన్ , మయాంక్ అగర్వాల్ నిరాశ పరిచారు.
మరోసారి ఢిల్లీ బౌలర్లు సత్తా చాటారు. ప్రధానంగా స్టార్ బౌలర్ గా పేరొందిన శార్దూల్ ఠాకూర్ నాలుగు వికెట్లు తీస్తే అక్షర్ పటేల్ , కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీశారు. నోర్డే ఒక్కడే ఒక వికెట్ తీశాడు.
మ్యాచ్ లో భాగంగా మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్(DC vs PBKS IPL 2022) నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఢిల్లీ కూడా పరుగులు చేసేందుకు నానా తంటాలు పడింది.
కానీ మిచెల్ మార్ష్ అద్భుతంగా ఆడాడు. ఒక్కడే 63 పరుగులు చేసి సత్తా చాటాడు. పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఇక పంజాబ్ బౌలర్లలో లియామ్ లివింగ్ స్టోన్ , ఆర్ష దీప్ చెరో మూడు వికెట్లు తీస్తే కగిసో రబాడ ఒక్క వికెట్ సాధించాడు.
జితేష్ శర్మ ఉన్నంత వరకు పంజాబ్ కు నమ్మకం ఉండేది. కానీ ఔట్ అయ్యాక చేతులెత్తేసింది.
Also Read : సైమండ్స్ డబ్బు..కీర్తి కోసం ఆడలేదు