India Rejects Farcial : పాక్ తీర్మానం భారత్ ఆగ్రహం
జమ్మూ కశ్మీర్ డీలిమిటేషన్ వ్యవహారం
India Rejects Farcial : భారత దేశం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాకిస్తాన్ తన తీరు మార్చుకోక పోవడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది. జమ్మూ కాశ్మీర్ అన్నది భారత్ లో అంతర్భాగం అని మరోసారి స్పష్టం చేసింది.
జమ్మూ కాశ్మీర్ డీలిమిటేషన్ పై పాకిస్తాన్ చేసిన ఫార్సికల్ తీర్మానాన్ని తిరస్కరించింది(India Rejects Farcial). పునర్విభజన కసరత్తుపై పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మంగళవారం తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
భారతీయ కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ , కాశ్మీర్ లో డీలిమిటేషన్ కసరత్తు అంశంపై పాకిస్తాన్ అసెంబ్లీ తీర్మానం చేయడాన్ని తాము ఖండిస్తున్నాం.
భారత దేశంలోని అంతర్గత విషయాలపై ఉచ్చరించడానికి లేదా జోక్యం చేసుకోవడానికి పాకిస్తాన్ కు ఎటువంటి అధికారం లేదని స్పష్టం చేసింది.
పాకిస్తాన్ అక్రమ, బలవంతపు ఆక్రమణలో ఉన్న భారత భూభాగాలు ముమ్మాటికీ భారత్ కు చెందినవే. ఎప్పటికైనా ఏనాటికైనా అని హెచ్చరించింది(India Rejects Farcial).
ఇంకోసారి భారత్ వైపు చూసినా లేదా ఇలాంటి చిల్లర వేషాలు వేసినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. జమ్మూ కాశ్మీర్ , లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన మొత్తం భూ భాగం భారత దేశంలో అంతర్భాగంగా ఉంది.
ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేసింది. ఇందులో ప్రపంచంలోని ఏ దేశానికి తమపై జోక్యం చేసుకునే హక్కు కానీ లేదా వ్యాఖ్యానించడానికి అర్హత లేదని కుండ బద్దలు కొట్టింది.
దీనిని తాము పూర్తిగా ఖండిస్తున్నామని పేర్కొంది. ప్రస్తుతం భారత్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
Also Read : సీబీఐ సోదాలు ఆసక్తికరం – చిదంబరం