Hardik Patel : కాంగ్రెస్ పార్టీకి షాక్ హార్దిక్ ప‌టేల్ గుడ్ బై

ట్విట్ట‌ర్ లో ప్ర‌క‌టించిన అస‌మ్మ‌తి నేత

Hardik Patel : గుజ‌రాత్ కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని షాక్ త‌గిలింది. సీనియ‌ర్ నాయ‌కుడు హార్దిక్ ప‌టేల్ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్న‌ట్లు బుధ‌వారం ప్ర‌క‌టించారు. అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల‌కు పార్టీ కేరాఫ్ గా మారింద‌న్నారు.

తాను హైక‌మాండ్ కు తెలిపినా ప‌ట్టించుకున్న దాఖాలు లేవ‌న్నారు. గుజ‌రాత్ ప్ర‌జ‌లు త‌న నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తార‌ని ఆశిస్తున్ట‌న్న‌ట్లు పేర్కొన్నారు. తాను వేసే ప్ర‌తి అడుగు గుజ‌రాతీలు సానుకూలంగా తీసుకుంటార‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు.

త‌న రాజీనామా లేఖ‌ను హార్దిక్ ప‌టేల్(Hardik Patel) ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీకి షేర్ చేశారు. రాష్ట్రంలో ప‌టేదార్లు బ‌ల‌మైన ఓటు బ్యాంకుగా ఉన్నారు. వారంద‌రినీ ఒకే చోట చేర్చ‌డంలో కీల‌క పాత్ర పోషించారు ప‌టేల్.

2019లో హార్దిక్ ప‌టేల్ కాంగ్రెస పార్టీలో చేరారు. త‌న‌ను కావాల‌ని కొంద‌రు ఇబ్బందుల‌కు గురి చేస్తున్నారంటూ ఇటీవ‌ల సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఈ త‌రుణంలో ఆయ‌న పార్టీని వీడ‌నున్న‌ట్లు అర్థ‌మైంది.

ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు హార్దిక్ ప‌టేల్. ఢిల్లీ నేత‌ల‌కు చికెన్ శాండ్ విచ్ పై మ‌క్కువ ఎక్కువ‌ని ఎద్దేవా చేశారు. సీనియ‌ర్ నేత‌లు గుజ‌రాతీల‌ను ద్వేషించేలా ప్ర‌వ‌ర్తిస్తున్నారంటూ మండిప‌డ్డారు.

ప్రజా స‌మ‌స్య‌ల‌పై ఫోక‌స్ పెట్ట‌డం లేద‌న్నారు. రాష్ట్ర పార్టీ చీఫ్ పై సంచ‌ల‌న కామెంట్స్ చేశారు హార్దిక్ ప‌టేల్. దేశం స‌వాళ్ల‌ను ఎదుర్కొన్న‌ప్పుడ‌ల్లా కాంగ్రెస్ నాయ‌క‌త్వం , నాయ‌కులు విదేశాల్లో ప‌ర్య‌టిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు హార్దిక్ ప‌టేల్(Hardik Patel).

స‌ర్దార్ వల్ల‌భాయ్ ప‌టేల్ ను అవ‌మానించిన కాంగ్రెస్ ను ప్ర‌జ‌లు ఎలా అక్కున చేర్చుకుంటార‌ని ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో నాయ‌కులు వ్య‌క్తిగ‌త ప‌నులు, లాభాల‌పైనే ఫోక‌స్ పెట్టార‌ని ప్ర‌జ‌ల‌ను విస్మ‌రించార‌ని ఆరోపించారు హార్దిక్ ప‌టేల్.

Also Read : రాజీవ్ హ‌త్య కేసులో కీల‌క తీర్పు

Leave A Reply

Your Email Id will not be published!