TRS Rajyasabha Candidates : టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులు వీరే
ప్రకటించిన పార్టీ చీఫ్, సీఎం కేసీఆర్
TRS Rajyasabha Candidates : అంతా ఊహించినట్లుగానే జరిగింది. గత కొంత కాలంగా ఎవరికి రాజ్యసభ సీట్లు దక్కుతాయనే దానికి బుధవారం నాటితో తెర దించారు టీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్. త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికలకు తమ పార్టీ(TRS Rajyasabha Candidates) నుంచి అభ్యర్థులను డిక్లేర్ చేశారు.
హెటిరో డ్రగ్స్ చీఫ్ పార్థ సారథి రెడ్డి, ఖమ్మం జిల్లాకు చెందిన రవిచంద్ర, నమస్తే తెలంగాణ ఎండీ దామోదర్ రావు పేర్లను ఖరారు చేశారు. ఇక ఇప్పటికే టీఆర్ఎస్ తరపున ఎంపీగా ఉన్న బండ ప్రకాశ్ రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు.
ఆయన స్థానంలో ఇంకా ఎవరినీ ప్రకటించ లేదు. ప్రస్తుతం ముగ్గురికి చాన్స్ ఇచ్చారు కేసీఆర్. పార్టీ తరపున ఇప్పటి వరకు ప్రాతినిధ్యం వహించిన కెప్టెన్ లక్ష్మీకాంత రావు, ధర్మపురి శ్రీనివాస్ ల పదవీ కాలం ముగుస్తుండడంతో వాటికి ఎన్నికలు జరగనున్నాయి.
ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఖాళీ అవుతున్న రాజ్యసభ ఎంపీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. 15 రాష్ట్రాలలో 57 మంది పదవీ కాలం పూర్తి కానుంది.
తెలంగాణ నుంచి ఇద్దరు ఉన్నారు. ఏపీలో నలుగురికి ఛాన్స్ ఇచ్చారు సీఎం జగన్ రెడ్డి. అందులో బీసీల నాయకుడిగా ఉన్న తెలంగాణకు చెందిన ఆర్. కృష్ణయ్యకు అవకాశం ఇచ్చి విస్తు పోయేలా చేశారు.
ఇక ఈనెల 24 నుంచి 31వ తేదీ వరకు నామిషన్లు స్వీకరిస్తారు. జూన్ 3న ఉపసంహరణ ఉంటుంది. అభ్యర్థుల్ని ప్రకటిస్తుంది ఈసీ. ఒకరి కంటే ఎక్కువ ఉంటే ఎన్నికలు చేపడతారు. లేదంటే డిక్లేర్ చేస్తారు ఎన్నికైనట్లు.
Also Read : ప్రగతి పథం తెలంగాణ అభివృద్ది మంత్రం