Kolkata Knight Riders : ఓడి పోయినా గుండెల్ని మీటారు
కోల్ కతా నైట్ రైడర్స్ పోరు గ్రేట్
Kolkata Knight Riders : ఆట అన్నాక గెలుపు ఓటములు సహజం. ఐపీఎల్ 2022లో ప్లే ఆఫ్స్ కోసం జరిగిన ఉత్కంఠ పోరులో కోల్ కతా నైట్ రైడర్స్ కేవలం 2 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. చివరి బంతి దాకా ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి.
కానీ విజయం దోబూచు లాడి చివరకు లక్నోను వరించేలా చేసింది. ప్రత్యర్థి తమ ముందు ఉంచిన భారీ లక్ష్యాన్ని ఎక్కడా తగ్గకుండా రన్ రేట్ కాపాడుకుంటూ కలిసి కట్టుగా ఆడింది కోల్ కతా. దురదృష్టం వారిని వెంటాడిందనే చెప్పాలి.
ఒక వేళ గెలిచి ఉండి ఉంటే ప్లే ఆఫ్స్ పై ఆశలు పెట్టుకుని ఉండేవాళ్లు. ఏది ఏమైనా ఐపీఎల్ ఆటకు ఉన్న శక్తి ముఖ్యంగా పొట్టి ఫార్మాట్
టీ20 లో ఉన్న మజా ఏమిటో, మ్యాచ్ అంటే ఏమిటో, బంతికి బ్యాట్ కు మధ్య ఎలాంటి యుద్దం నడుస్తుందో లక్నో, కోల్ కతా మధ్య చూస్తే చెప్పవచ్చు.
ఒక మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ 210 పరుగులు చేస్తే కోల్ కతా నైట్ రైడర్స్ 208 పరుగులు చేసింది. అంటే ఇరు జట్లు
కలిసి 418 పరుగులు చేశాయి.
లక్నో ఉత్కంఠ భరిత పోరులో విజయం సాధించినా క్రికెట్ క్రీడాభిమానుల మనసుల్ని మాత్రం కోల్ కతా(Kolkata Knight Riders) ఆటగాళ్లు గెలుచుకున్నారు. నితీష్ రాణా రెచ్చి పోతే శ్రేయస్ అయ్యర్ దంచి కొట్టాడు.
ఆ తర్వాత తక్కువ స్కోర్ కే పరిమితం అవుతుందని అనుకున్నారంతా. కానీ సామ్ బిల్లింగ్స్ , రింకూ సింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగారు.
ప్రధానంగా ఈ మ్యాచ్ లో ఇద్దరు మాత్రం విధ్వంసకరమైన రీతిలో ఆడారు.
లక్నో తరపున క్వింటన్ డికాక్ ఆడితే కోల్ కతా తరపున రింకూ సింగ్ ఆడారు. ఏది ఏమైనా కోల్ కతా ఎప్పటికీ గుర్తు పెట్టుకునేలా ఆడింది.
ఆటకు ఉన్న మజా ఏమిటో తెలియ చేసింది.
గెలుపు ఓటముల్ని పక్కన పెడితే పోరాటం అన్నది ఆప కూడదని కోల్ కతా నిరూపించింది. ఇదే విషయాన్ని నేటి యువతరం గుర్తు పెట్టుకుంటే బెటర్.
ఎందుకంటే లక్ష్యం పెట్టుకోవడం, దానిని అందుకునేంత దాకా కృషి చేస్తే గెలుపు ఇవాళ కాక పోయినా రేపైనా దక్కుతుంది.
Also Read : దంచి కొట్టిన రింకూ సింగ్