Hardik Patel : బీజేపీలో చేరడంపై పటేల్ కామెంట్
కాంగ్రెస్ పార్టీలో మూడేళ్లు వేస్ట్
Hardik Patel : గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసిన ప్రముఖ పటేదార్ వర్గం నాయకుడిగా పేరొందిన హార్దిక్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
భారతీయ జనతా పార్టీలో చేరడంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. 2019లో పటేల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2020లో వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు.
ఆ తర్వాత తనను వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. ఆయన స్వంత పార్టీ నేతలపై గుర్రుమన్నారు. ఇదే సమయంలో హైకమాండ్ పై, రాష్ట్ర నాయకులపై సంచలన ఆరోపణలు చేశారు.
ఇక్కడి నేతలు విదేశాలలో పర్యటించేందుకు ఫోకస్ పెడుతున్నారని, హైకమాండ్ ను ప్రసన్నం చేసుకునేందుకు తంటాలు పడుతున్నారంటూ పేర్కొన్నారు. కానీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం లేదంటూ ఆరోపించారు.
గుజరాత్ లో కాంగ్రెస్ సర్కార్ కొలువు తీరి ఉంది. ఆయన పాటిదార్ అనామత్ ఆందోళన్ సమితి కన్వీనర్ గా ఉన్నారు. ఈ సందర్భంగా హార్దిక్ పటేల్(Hardik Patel) మాట్లాడుతూ తాను బీజీపీలో చేరడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు.
కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓటు వేయొద్దంటూ కోరారు. 2017లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కు ఓటు వేయాలని కోరిన ఆయన ప్రస్తుతం ఆ పార్టీకి ఓటు వేయొద్దంటూ కోరుతున్నారు.
గుజరాత్ కాంగ్రెస్ లో కుల రాజకీయాలు ఎక్కువ. నేను పార్టీలో మూడేళ్లు ఉండి విలువైన సమయాన్ని వృధా చేసుకున్నానంటూ మండిపడ్డారు.
కాగా పటేల్ బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నట్లు సమాచారం. తాను బీజేపీ లేదా ఆప్ లో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు హార్దిక్ పటేల్(Hardik Patel).
Also Read : బీజేపీకి జై కొట్టిన సునీల్ జాఖర్