Lalu Prasad Yadav : లాలూ ఫ్యామిలీకి సీబీఐ బిగ్ షాక్
రైల్వే శాఖ పోస్టుల నియామకాల్లో చేతివాటం
Lalu Prasad Yadav : దాణా కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవించి నానా ఇబ్బందులు పడుతున్న బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav) కు మరో షాక్ తగిలింది. ప్రస్తుతం సీబీఐ ఆయనతో పాటు కుటుంబంపై కూడా కేసు నమోదు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆ శాఖలో జరిగిన పోస్టుల నియామకాల్లో అక్రమాలకు తెర లేపారంటూ తాజాగా సీబీఐ ఆరోపించింది. ఈ మేరకు కేసు నమోదు చేసింది.
ఇందులో భాగంగా సీబీఐ శుక్రవారం ఎంటర్ అయ్యింది. లాలూ ప్రసాద్ ఇంటితో పాటు ఆయన పార్టీకి సంబంధించిన 15 ప్రదేశాలలో సోదాలు చేపడుతోంది. ఈ కేసులో లాలూ కుటుంబీలకు ప్రధాన పాత్ర ఉందంటూ ఆరోపించింది.
జాబ్స్ ఇప్పించేందుకు ఎలాంటి అనుమానం రాకుండా లాలూ(Lalu Prasad Yadav) ఫ్యామిలీ మెంబర్స్ భూములు, ఆస్తులను లంచంగా పుచ్చుకున్నారంటూ ఆరోపించింది కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ.
ఇటీవలే రూ. 139 కోట్ల డోరండా ట్రెజరీ స్కాం కేసులో జార్ఖండ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో సీబీఐ స్పెషల్ కోర్టు 5 ఏళ్ల జైలు శిక్ష, 60 లక్షల జరిమానా విధించింది.
ఇదిలా ఉండగా తాము ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, ప్రజల్లో రోజు రోజుకు లాలూకు, ఆయన ఫ్యామిలీకి జనాదరణ పెరుగుతోందని, దీనిని తట్టుకోలేక కేంద్ర, రాష్ట్ర సర్కార్ కుమ్మక్కై వేధింపులకు, అక్రమ కేసులు బనాయిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆర్జేడీ ఎమ్మెల్యే ఒకరు ఆరోపించారు.
కావాలని ఇలా చేస్తున్నారంటూ మండిపడ్డారు.
Also Read : కాంగ్రెస్ కోటరీ కాదది ఓ ముఠా