Rahul Gandhi Chai : రాహుల్ గాంధీ టీ ప్రియుడు
ఇరానీ చాయ్ అంటే ఇష్టం
Rahul Gandhi Chai : ఇవాళ ప్రపంచ టీ దినోత్సవం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చాయ వాలాగా పని చేశారు. దేశానికి ప్రధాన మంత్రి అయ్యారు. భారత దేశంలో కోట్లాది మంది ఎక్కువగా ఇష్ట పడేది మాత్రం తక్కువ ధరకు దొరికేది చాయ్ నే.
దేశాన్ని శాసిస్తున్న రాజకీయ నాయకుల దగ్గరి నుంచి వ్యాపార వేత్తలు, సామాన్యుల నుంచి సెలెబ్రిటీలు, క్రీడాకారుల దాకా అంతా చాయ్ ప్రియులే. ఇక సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi Chai) కి కూడా టీ అంటే విపరీతమైన ఇష్టం.
ఆయన ఎన్నికల్లో ఎక్కడికి వెళ్లినా, ఏ రాష్ట్రానికి వెళ్లినా ముందుగా అడిగేది ఇరానీ చాయ్ నే. లేదా ఏదైనా సరే వేడి వేడిగా టీ ఉందా అని మరీ అడుగుతారు. టీ తయారు చేసే టీకొట్టుల వద్దకు వెళతారు.
తానే డబ్బులు చెల్లించి అక్కడ టీ తాగుతారు. ఆ టీ స్టాల్ వద్ద నిలిచి ఉన్న వారందరితో కలిసి ముచ్చటిస్తారు. పిచ్చా పాటి మాట్లాడతారు. ఇది ఆయన స్పెషాలిటీ. టీ తాగుతూ జనంతో మమేకం కావడం రాహుల్ గాంధీ స్పెషాలిటీ.
కోట్లాది రూపాయలు ఉన్నా, పార్టీకి అగ్ర నాయకుడిగా వెలుగొందుతున్నా ఆయన ఇప్పటికీ సామాన్యుడిగానే ఉండేందుకు ప్రయత్నం చేస్తారు. ఇందులో భాగంగా రాహుల్ హాట్ టాపిక్ గా మారుతున్నారు.
ఇటీవల ఆయన తెలంగాణలో పర్యటించారు. ఈ సందర్భంగా పదాధికారుల సమావేశంలో కీలక ప్రసంగం చేశారు. ఆయన ప్రత్యేకంగా హైదరాబాద్ బిర్యానీని, ఇరానీ చాయ్ ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.
వాటిని స్వీకరించకుండా ఉండలేనంటూ చెప్పారు. మొత్తంగా టీ అన్నది ప్రతి ఒక్కరికి ఇష్టమైనదిగా మారి పోయింది.
Also Read : ఇరానీ చాయ్ చాలా స్వీట్ గురూ