KCR Akhilesh Yadav : అఖిలేష్ తో సీఎం కేసీఆర్ భేటీ
దేశ రాజకీయాలపై ఫోకస్
KCR Akhilesh Yadav : దేశ రాజకీయాలలో చక్రం తిప్పాలని యోచిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ అందుకు తగినట్టుగానే పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీకి చేరుకున్న కేసీఆర్ ను(KCR Akhilesh Yadav) సమాజ్ వాది పార్టీ చీఫ్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ భేటీ అయ్యారు.
వీరిద్దరూ చాలా సేపు చర్చించారు. ఇందులో ప్రధాన అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ -23లోని కేసీఆర్ నివాసంలో వీరిద్దరూ కలుసు కోవడం రాజకీయ వర్గాలలో పెను సంచలనంగా మారింది.
ప్రత్యామ్నాయ కూటమి, ప్రస్తుతం దేశంలో నెలకొన్న పొలిటికల్ పరిస్థితులు , బీజేపీ అనుసరిస్తున్న విధానాలు, తదితర అంశాలు చర్చకు ప్రధానంగా వచ్చినట్లు సమాచారం.
ఇదే సమయంలో జాతీయ మీడియా సంస్థలకు చెందిన యజమానులు, ప్రముఖ జర్నలిస్టులతో చర్చించానున్నారు. సీఎం వెంట ఎంపీలు సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ఉన్నారు.
ఈసారి దేశ వ్యాప్తంగా పర్యటించేందుకు ప్లాన్ చేశారు. ఈనెల 30 దాకా సీఎం కేసీఆర్ పర్యటిస్తారు. చండీగఢ్ వెళతారు. అక్కడ పంజాబ్, ఢిల్లీ సీఎంలతో కలిసి రైతు పోరులో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు పరిహారం అందజేస్తారు.
అక్కడి నుంచి కర్ణాటక వెళతారు. మాజీ దేశ ప్రధాన మంత్రి దేవగౌడ, మాజీ సీఎం హెచ్ డి కుమార స్వామిలతో సమావేశం కానున్నారు. ఈనెల 27న మహారాష్ట్ర లోని రాలేగావ్ సిద్దికి చేరుకుంటారు.
అక్కడ ప్రముఖ సామాజికవేత్త అన్నా హజారేను కలుసుకుంటారు. తాను చేపట్టే ప్రత్యామ్నాయ పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరుతారు.
Also Read : పర్పుల్ క్యాప్ రేసులో చహల్ టాప్