PV Sindhu : థాయ్ ఓపెన్ టోర్నీలో సింధు ఓటమి
వరుస సెట్లలో పరాజయం
PV Sindhu : భారత స్టార్ షట్లర్ పీవీ సింధు నిరాశ పరిచింది. థాయ్ ఓపెన్ సూపర్ 500 టోర్నీలో చుక్కెదురైంది. రెండు సార్లు ఒలింపిక్ పతక విజేతగా నిలిచింది కూడా. చివరి దాకా అద్భుతమైన ప్రదర్శన చేసింది.
శనివారం జరిగిన సెమీస్ లో ఒలింపిక్ చాంపియన్ గా నిలిచిన, ప్రపంచ నాలుగో సీడ్ అయిన చైనాకు చెందిన చెన్ యు ఫీ చేతిలో వరుస సెట్లలో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ రసవత్తరంగా హోరా హోరీగా నడుస్తుందని భారత క్రీడాభిమానులు అనుకున్నారు.
కానీ వారి ఆశలపై నీళ్లు చల్లింది పీవీ సింధు. కేవలం ఆట 43 నిమిషాల్లో ముగియడంతో విస్తు పోయారంతా. దీంతో ఆరో సీడ్ గా ఉన్న సింధు 17-21, 16-21 తేడాతో ఓటమి పాలు కావడం బాధ పెట్టింది.
దీంతో గత కొన్ని రోజులుగా టోర్నీలో ఆడుకుంటూ వచ్చి సెమీస్ లో వెనుదిరగడం పై నిరాశకు గురి చేసింది. టోక్యోలో తన ఆట తీరుతో పసిడి పతకాన్ని చేజిక్కించుకుని చరిత్ర సృష్టించిన చెన్. ఎక్కడా ప్రత్యర్థి పీవీ సింధుకు చాన్స్ ఇవ్వకుండా ఆడింది.
ఆట ప్రారంభం నుంచే దాడి చేయడం మొదలు పెట్టింది. దీంతో ఊపిరి కూడా పీల్చుకోనీయకుండా చేయడంతో తట్టుకోలేక పోయింది సింధు(PV Sindhu). చెన్ పై 6-4 ఆధిక్యాన్ని ప్రదర్శించిన సింధు ఆ తర్వాత ఎక్కడా పోటీ ఇవ్వలేక పోయింది.
చెన్ పీవి సింధు గతంలో 2019లో వరల్డ్ టూర్ సందర్బంగా పోటీ పడ్డారు. ఆ పోటీలో కూడా చైనా స్టార్ షెట్లర్ విజయం సాధించింది పీవీ సింధుకు(PV Sindhu) షాక్ ఇచ్చింది.
Also Read : పర్పుల్ క్యాప్ రేసులో చహల్ టాప్