Delhi Court : వ్య‌క్తి బాధ స‌మాజానికి వ‌ర్తించ‌దు

ప్రొఫెస‌ర్ ర‌త‌న్ లాల్ బెయిల్ పై కోర్టు

Delhi Court : యూపీలోని జ్ఞాన్ వాపి మ‌సీదు స‌ర్వే దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపింది. దీనిపై వార‌ణాసి సిటీ కోర్టు విచార‌ణ చేప‌ట్టింది. ఈ త‌రుణంలో అక్క‌డ దొరికింది శివ‌లింగ‌మేనా అంటూ ఢిల్లీ యూనివ‌ర్శిటీలో చ‌రిత్ర ప్రొఫెస‌ర్ గా ప‌ని చేస్తున్న ర‌త‌న్ లాల్ ప్ర‌శ్నిస్తూ ట్వీట్ చేశారు.

దీనిపై ఢిల్లీ పోలీసులు ప్రొఫెస‌ర్ ను శుక్ర‌వారం రాత్రి అరెస్ట్ చేశారు. ఇది అక్ర‌మం అంటూ భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌కు విరుద్ద‌మంటూ ఆయ‌న త‌ర‌పు న్యాయ‌వాది ఢిల్లీ కోర్టులో బెయిల్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

శ‌నివారం దీనిపై విచార‌ణ చేప‌ట్టింది కోర్టు. ఈ సంద‌ర్భంగా ప్రొఫెస‌ర్ ర‌త‌న్ లాల్ కు బెయిల్ మంజూరు చేస్తూ కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. వ్య‌క్తి అనుభ‌విస్తున్న బాధ స‌మాజానికి వ‌ర్తించ‌ద‌ని స్ప‌ష్టం చేసింది.

బాధాక‌ర‌మైన భావాల‌కు సంబంధించి అటువంటి ఫిర్యాదు ఏదైనా వాస్త‌వాల ప‌రిస్థితుల మొత్తం ప‌రిస్థితిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని దాని సంద‌ర్భంలో చూడాల‌ని సూచించింది.

ప్ర‌స్తుత ఎఫ్ఐఆర్ కు దారి తీసిన వివాదానికి సంబంధించి ఎటువంటి సోష‌ల్ మీడియా పోస్టులు లేదా ఇంట‌ర్వ్యూల‌ను పోస్ట్ చేయ‌కుండా క‌చ్చితంగా దూరంగా ఉండాల‌ని స్ప‌ష్టం చేసింది కోర్టు(Delhi Court). భార‌తీయ నాగ‌రిక‌త ప్ర‌పంచంలోనే అత్యంత పురాత‌న‌మైన‌ది.

అన్ని మ‌తాల‌ను స‌హించేది, అంగీక‌రించేదిగా గుర్తించ బ‌డింద‌ని పేర్కొంది కోర్టు. మ‌రొక వ్య‌క్తికి అదే పోస్ట్ అవ‌మాన‌క‌ర‌మైన‌దిగా అనిపించ‌వచ్చు. కానీ మ‌రొక సంఘం ప‌ట్ల ద్వేష భావాన్ని ప్రేరేపించ‌క పోవ‌చ్చ‌ని తెలిపింది.

పోస్ట్ ఖండించ ద‌గిన‌ది అయిన‌ప్ప‌టికీ వ‌ర్గాల మ‌ధ్య ద్వేషాన్ని పెంచే ప్ర‌య‌త్నాన్ని సూచించ‌డం లేద‌ని అభిప్రాయ‌ప‌డింది. ప్ర‌స్తుతం ప్రొఫెస‌ర్ పై ఎలాంటి నేర చరిత్ర లేని మంచి పేరున్న వ్య‌క్తి. ఆయ‌న ఎక్క‌డికీ పారిపోయే ప్ర‌స‌క్తి లేద‌ని కోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది.

Also Read : ఢిల్లీ ప్రొఫెస‌ర్ కు బెయిల్ మంజూరు

Leave A Reply

Your Email Id will not be published!