KCR Kejriwal : దేశంలో మార్పు జ‌ర‌గ‌డం ఖాయం

జోస్యం చెప్పిన తెలంగాణ సీఎం కేసీఆర్

KCR Kejriwal : ఈ దేశం మార్పును కోరుకుంటోంది. అది జ‌రిగి తీరుతుంది. ఆ సంచ‌ల‌నం ఏమిటో మీరు త్వ‌ర‌లోనే చూస్తారంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్). శ‌నివారం సాయంత్రం ఢిల్లీ సీఎం అర‌వింద్ర కేజ్రీవాల్ ,

డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియాతో క‌లిసి కేసీఆర్ ఢిల్లీలోని స‌ర్వోద‌య పాఠ‌శాల‌ను సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా కేజ్రీవాల్ తో క‌లిసి సీఎం కేసీఆర్(KCR Kejriwal) మీడియాతో మాట్లాడారు.

ఢిల్లీ ప్ర‌భుత్వం ప్ర‌ధానంగా విద్య‌, వైద్యం, ఉపాధి పై ఫోక‌స్ పెడుతోంది. తెలంగాణ ప్ర‌భుత్వం కూడా ఇదే త‌ర‌హాలో ప్ర‌య‌త్నం చేస్తోంది. ఐటీలో దేశానికే తెలంగాణ త‌ల‌మానికంగా నిలిచింద‌న్నారు.

పాఠ‌శాల‌ల‌ను ద‌గ్గ‌రుండి చూశాను. చాలా సంతోషానికి లోన‌య్యాను. పిల్ల‌ల‌తో క‌లిసి నేనే స్వ‌యంగా మాట్లాడా. వాళ్లు అద్భుత‌మైన ఆత్మ విశ్వాసంతో ఉన్నారు.

ఈ ప్ర‌పంచంతో పోటీ పడేందుకు సిద్దంగా ఉన్నామ‌ని వారు గ‌ర్వంగా చెప్ప‌డం త‌న‌ను ఆస‌క్తిని క‌లిగించింద‌న్నారు సీఎం కేసీఆర్(KCR Kejriwal). ఢిల్లీ ఆప్ స‌ర్కార్ అమ‌లు చేస్తున్న విద్యా విధానం అద్భుతంగా ఉంది.

ఈ ప‌ద్దతి ఇంకెక్క‌డా అమ‌లు కావ‌డం లేద‌న్నారు. విద్యార్థుల‌ను జాబ్ ప్రొవైడ‌ర్లుగా మార్చుతున్నారంటూ కేజ్రీవాల్ ను ప్ర‌శంసించారు. ఢిల్లీ ప్ర‌భుత్వ స్కూళ్ల‌ల్లో విద్యా విధానం సూప‌ర్. తెలంగాణ అధికారుల్ని ఢిల్లీకి పంపించి స‌మ‌న్వ‌యం చేస్తామ‌న్నారు.

అక్క‌డ కూడా విద్యా విధానం మారుస్తామ‌ని చెప్పారు సీఎం కేసీఆర్. ఇదే స‌మ‌యంలో ఆయ‌న కేంద్ర ప్ర‌భుత్వంపై మ‌రోసారి నిప్పులు చెరిగారు. ప్ర‌స్తుతం తీసుకొస్తున్న విద్యా విధానం ఏక‌ప‌క్షంగా ఉంద‌ని ధ్వ‌జ‌మెత్తారు.

అన్ని రాష్ట్రాల అభిప్రాయాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల‌ని కేసీఆర్ డిమాండ్ చేశారు.

Also Read : అఖిలేష్ తో సీఎం కేసీఆర్ భేటీ

Leave A Reply

Your Email Id will not be published!