Delhi Capitals IPL 2022 : చేజేతులా ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్
కెప్టెన్ పంత్ స్వయం కృతాపరాధం
Delhi Capitals IPL 2022 : ఐపీఎల్ 2022లో ఊహించని రీతిలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. గత 14 సీజన్లలో 8 జట్లు ఆడితే ఈసారి 15వ సీజన్ లో 2 జట్లు అదనంగా చేరాయి.
గతంలో ఆడిన అన్ని జట్లను మట్టి కరిపించి గుజరాత్ టైటాన్స్ , లక్నో సూపర్ జెయింట్స్ దర్జాగా ప్లే ఆఫ్స్ కు చేరాయి. ఇక టైటిల్ ఫెవరేట్లుగా ఉన్న ముంబై ఇండియన్స్ , చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఈసారి 9, 10 స్థానాలకే పరిమితమై ఇంటి బాట పట్టాయి.
విచిత్రం ఏమిటంటే ఆఖరు మ్యాచ్ లో మాత్రం కోలుకోలేని షాక్ ఇచ్చింది రోహిత్ సేన ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals IPL 2022) కు. ప్లే ఆఫ్స్ కు చేరుకోవాలంటే ముంబై తో కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ ను చేజేతులారా పోగొట్టుకుంది పంత్ సేన.
మితిమీరిన ఆత్మ విశ్వాసం ఆ జట్టును ఓడి పోయేలా చేసింది. అంతే కాదు అనుభవ రాహిత్యంతో కూడిన నాయకత్వం (కెప్టెన్సీ) ఢిల్లీకి శాపంగా మారింది. ఆపై జట్టులో సమన్వయం కొరవడింది.
బౌలర్లు అద్భుతంగా రాణించినా పేలవమైన ఫీల్డింగ్ కొంప ముంచేలా చేసింది. ప్రధానంగా ముందుండి నడిపించాల్సిన కెప్టెన్ చేతికి వచ్చిన క్యాచ్ ను వదిలి వేయడం కూడా ఇబ్బంది కరంగా మారింది.
మరో వైపు ఢిల్లీ(Delhi Capitals IPL 2022) చేతిలో నుంచి మ్యాచ్ ను తమ జట్టు వైపు తిప్పేలా చేసిన టిమ్ డేవిడ్ విషయంలో డీఆర్ఎస్ తీసుకోవడంలో వెనక్కి తగ్గడం రిషబ్ పంత్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మొత్తంగా చూస్తే ముంబై కొట్టిన దెబ్బకు ఢిల్లీ కోలుకోలేని షాక్ కు గురైంది. ఆపై ఎంచక్కా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్స్ కు చేరింది.
Also Read : ఢిల్లీ దురదృష్టం బెంగళూరు అదృష్టం