KCR : జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలని ప్రయత్నం చేస్తున్న సీఎం కేసీఆర్ మరోసారి మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఆయన ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో కలిసి ఆప్ సర్కార్ ఆధ్వర్యంలో నడుస్తున్న స్కూల్స్ ను సందర్శించారు.
అద్భుతంగా ఉందంటూ కితాబు ఇచ్చారు. ఈ విద్యా విధానాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దేశం ఎటు పోతోందో అర్థం కావడం లేదన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఎవరిని అడిగి కొత్త విద్యా విధానాన్ని తీసుకు వస్తానంటోందని ప్రశ్నించారు. రాష్ట్రాలను సంప్రదించకుండా అమలు చేయాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
బడులు బాగున్నాయని, ఢిల్లీ తరహా విద్యా విధానాన్ని తెలంగాణలో అమలు చేస్తామన్నారు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలతో సంప్రదించాకే నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్(KCR).
ఈ సందర్భంగా సీఎం కేజ్రీవాల్ ను అభినందించారు. మహమ్మదీయ నగర్ లోని మొహల్లా క్లినిక్ ను సందర్శించారు. ఇదే సమయంలో విద్యార్థులు ఒత్తిళ్లకు గురి కాకుండా విద్యా బోధన చేస్తుండడం బాగుందన్నారు.
వారి ఆలోచనా విధానం కూడా బాగుందని కితాబు ఇచ్చారు కేసీఆర్. మొహల్లా క్లినిక్ ల తరాహాలో తెలంగాణలో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశామని చెప్పారు సీఎం.
ఇవాళ 600 మంది రైతు కుటుంబాలకు కేసీఆర్ పంజాబ్, ఢిల్లీ సీఎంలు భగవంత్ మాన్ , కేజ్రీవాల్ తో కలిసి రూ. 3 లక్షల చొప్పున చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ప్రశంసించిన కేసీఆర్(KCR) కు ధన్యవాదాలు తెలిపారు సీఎం కేజ్రీవాల్.
Also Read : చాయ్ తాగితే ఫుల్ జోష్