Tamil Nadu FM : మోదీ స‌ర్కార్ పై త్యాగ‌రాజ‌న్ ఫైర్

ఎవ‌రిని అడిగి ఆయిల్ ధ‌ర‌లు పెంచారు

Tamil Nadu FM : బీజేపీయేత‌ర రాష్ట్రాలు కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్ర‌భుత్వంపై భ‌గ్గుమంటున్నాయి. అనుస‌రిస్తున్న విధానాలు రాష్ట్రాల‌కు వ్య‌తిరేకంగా, ప్ర‌జ‌ల‌కు భారంగా ఉండేలా ఉన్నాయ‌ని మండిప‌డ్డారు త‌మిళ‌నాడు(Tamil Nadu FM) రాష్ట్ర ఆర్థిక మంత్రి త్యాగ‌రాజ‌న్.

ఆయ‌న పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల పెంపుపై నిప్పులు చెరిగారు. ఎవ‌రిని అడిగి పెంచారు. ఎవ‌రితో సంప్ర‌దించి త‌గ్గించారో చెప్పాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వానికి ఇప్ప‌టి వ‌ర‌కు ఒక విధానం అంటూ లేకుండా పోయింద‌ని మండిప‌డ్డారు.

దేశ ప్ర‌యోజ‌నాల‌ను బ‌డా వ్యాపార‌వేత్త‌ల‌కు ధార‌ద‌త్తం చేయ‌డంలో ఉన్నంత శ్ర‌ద్ద స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై లేకుండా పొయిందంటూ సీరియ‌స్ అయ్యారు. రాష్ట్రాలు ఇంధ‌నంపై ప‌న్నులు త‌గ్గించాల‌ని అడుగుతుండ‌డం త‌న‌ను విస్తు పోయేలా చేసింద‌న్నారు.

పెట్రోల్ పై ట్యాక్సులు పెంచిన‌ప్పుడు ఏ రాష్ట్రాన్నైనా మీరు అడిగారా అని త్యాగ‌రాజ‌న్ నిల‌దీశారు. క‌నీసం స‌మాచారం కూడా ఇవ్వ‌ర‌ని, ఒంటెత్తు పోక‌డ‌లు పోవ‌డం ఒక్క దేశ ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ కే చెల్లింద‌న్నారు.

ఆమె ప్ర‌భుత్వ ఆస్తుల‌ను అమ్మేందుకు మాత్ర‌మే ఉంద‌ని, ఇందుకు ఆర్థిక మంత్రి ఎందుక‌ని ప్ర‌శ్నించారు. ఇదే స‌మ‌యంలో మోదీ స‌ర్కార్ దేశంలో వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి లీట‌ర్ పెట్రోల్ పై రూ. 23 , డీజిల్ పై రూ. 29 పెంచిందంటూ ఆరోపించారు.

2014 సంవ‌త్స‌రంతో పోల్చితే ఇది పెట్రోల్ పై 250 శాతం, డీజిల్ పై 900 శాతం అధికం అంటూ ఫైర్ అయ్యారు త్యాగ‌రాజ‌న్. ఇదిలా ఉండ‌గా కేంద్రం పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని త‌గ్గించింది.

అయితే రాష్ట్రాలు కూడా ప‌న్నుల్లో కోత విధించాల‌ని నిర్మ‌లా కోర‌డాన్ని ఆయ‌న తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు.

Also Read : దేశంలో మార్పు జ‌ర‌గ‌డం ఖాయం

Leave A Reply

Your Email Id will not be published!