Arvind Kejriwal : రైతన్నల ఆందోళనకు మద్ధతిచ్చాం
స్పష్టం చేసిన అరవింద్ కేజ్రీవాల్
Arvind Kejriwal : దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించి మోదీ సర్కార్ మెడలు వంచి వ్యవసాయ చట్టాలు రద్దు అయ్యేంత వరకు విశ్రమించకుండా విజేతలుగా నిలిచిన రైతుల పోరాటాన్ని ప్రశంసించారు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.
ఆందోళన సమయంలో కేంద్ర ప్రభుత్వం రైతులను ఢిల్లీ స్టేడియంలను తాత్కాలిక జైళ్లుగా మార్చాలని ప్రయత్నం చేసిందని, కానీ మోదీ దుర్మార్గ పూరితమైన ఆలోచనలను పసిగట్టి తాము అడ్డుకున్నామని చెప్పారు.
నిరసన తెలిపిన రైతులకు లంగర్లు, తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యాలకు ఢిల్లీ ప్రభుత్వం సహాయం చేసిందని చెప్పారు. నేను కూడా ఆందోళన చేసిన వాడినే. అన్నా హజారే చేపట్టిన నిరసనలో అప్పట్లో మాకు ఇలాగే చేసే వారని గుర్తు చేశారు అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal).
నేనూ స్టేడియాల్లోనే రోజుల తరబడి ఉండి పోయానని చెప్పారు. అది కూడా కుట్రలో భాగమని అర్థమైందన్నారు. రైతుల ఆందోళనను అంతం చేసేందుకు బీజేపీ సర్కార్ చేసిన ప్రయత్నం విఫలమైందన్నారు.
పంజాబ్ లో కిసాన్ ఆందోళన సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన 600 మంది కుటుంబాలకు రూ. 3 లక్షల చొప్పున తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ పంపిణీ చేశారు.
కార్యక్రమంలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) తో పాటు భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ అధికార ప్రతినిధి, సంయుక్త కిసాన్ మోర్చా అగ్ర నేత రాకేశ్ తికాయత్ పాల్గొన్నారు.
ఢిల్లీకి వచ్చే రైతులను స్టేడియంలో గనుక నిర్బంధించి ఉంటే కిసాన్ ఆందోళన మైదానాలకే పరిమితమై ఉండేదన్నారు సీఎం కేజ్రీవాల్. దానిని మేము ఒప్పు కోలేదన్నారు.
వారు తమ పట్ల కోపంగా ఉన్నారని కానీ పట్టించు కోలేదన్నారు. నా కిసాన్ సోదరులు, సోదరీమణులకు సాయం చేసినందుకు ఆనందంగా ఉందన్నారు.
Also Read : దేశంలో మార్పు జరగడం ఖాయం