Ravi Shastri Pant : ఆర్సీబీకి పరోక్షంగా పంత్ సపోర్ట్
రవిశాస్త్రి సంచలన కామెంట్స్
Ravi Shastri Pant : భారత క్రికెట్ జట్టు మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి సంచలన కామెంట్స్ చేశారు. ఐపీఎల్ 2022లో ప్లే ఆఫ్స్ కు చేరుకోవాల్సిన కీలక మ్యాచ్ లో కావాలని ఓడి పోయేలా చేశారంటూ మండిపడ్డాడు.
అంతే కాదు ఒక రకంగా చెప్పాలంటే రిషబ్ పంత్ దగ్గరుండి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును దగ్గరుండి ప్లే ఆఫ్స్ కు పంపించాడంటూ ఆరోపణలు చేశారు రవిశాస్త్రి. అసలు రిషబ్ పంత్( Pant) ఏం చేస్తున్నాడో అర్థం కాలేదన్నాడు.
మ్యాచ్ లో ఆడే జట్లకు రెండు సార్లు డీఆర్ఎస్ తీసుకునే హక్కు ఉంటుంది. ఆ అవకాశం ఉన్నప్పటికీ టిమ్ డేవిడ్ విషయంలో ఎందుకు తీసుకోలేక పోయాడంటూ ప్రశ్నించాడు.
ఇదే సమయంలో కెప్టెన్ పంత్ కు తెలివి లేక పోతే ఓకే. మరి మిగతా జట్ల ఆటగాళ్ల మెదళ్లు ఎందుకు పని చేయలేదని ప్రశ్నించాడు. అత్యంత ఉదాసీనంగా వ్యవహరించడమే కాకుండా బాధ్యతను మరిచి కెప్టెన్సీ చేశాడంటూ సీరియస్ అయ్యాడు రవిశాస్త్రి(Ravi Shastri Pant).
ఒక వేళ టిమ్ డేవిడ్ గనుక డీఆర్ఎస్ నుంచి ఔట్ అయి ఉండింటే కచ్చితంగా ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ కు చేరుకునేదని అభిప్రాయ పడ్డాడు. ఒక రకంగా రిషబ్ పంత్(Pant) మైండ్ దొబ్బిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఇందుకు భారీగా మూల్యం చెల్లించుకుందంటూ పేర్కొన్నాడు రవిశాస్త్రి(Ravi Shastri). మొత్తంగా ఢిల్లీ ప్లేయర్లంతా కలిసి తాము ఓడి పోయి ఆర్సీబీని హాయిగా , ఎంచక్కా ఎంజాయ్ చేయమంటూ ప్లే ఆఫ్స్ కు పంపించారంటూ ఎద్దేవా చేశారు.
ఇదిలా ఉండగా టిమ్ డేవిడ్ ఢిల్లీ చేతుల్లో ఉన్న మ్యాచ్ ను అమాంతం ముంబై వైపు తీసుకు వెళ్లాడు. 11 బంతులు ఎదుర్కొని 4 సిక్సర్లు 3 ఫోర్లతో 34 రన్స్ చేశాడు.
Also Read : రోహిత్ శర్మకు విశ్రాంతి అక్కర్లేదు