Tarun Chugh : మాదే రాజ్యం టీఆర్ఎస్ ప‌త‌నం ఖాయం

ప‌దాధికారుల స‌మావేశంలో జోస్యం

Tarun Chugh : భార‌తీయ జ‌న‌తా పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, తెలంగాణ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్ చార్జి త‌రుణ్ చుగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 2023లో జ‌రిగే ఎన్నిక‌ల్లో నియంత పాల‌న‌కు తెర ప‌డ‌నుంద‌ని, కాషాయ జెండా ఎగ‌ర‌డం ఖాయ‌మ‌ని ఆయ‌న జోస్యం చెప్పారు.

ఇది తాను చెప్ప‌డం లేద‌ని రాష్ట్ర ప్ర‌జలంతా త‌మ మ‌నసు లోని మాటల్ని తాను తెలియ చేస్తున్న‌ట్లు తెలిపారు. హైద‌రాబాద్ లో జ‌రిగిన పార్టీ ప‌దాధికారుల స‌మావేశంలో త‌రుణ్ చుగ్(Tarun Chugh) పాల్గొన్నారు.

దేశం ముందు పార్టీ త‌ర్వాత కుటుంబం ఆఖ‌రు అన్న‌ది బీజేపీ సిద్దాంత‌మే కాదు అదే త‌మ నినాద‌మ‌ని చెప్పారు. దేశ వ్యాప్తంగా బీజేపీ గాలి వీస్తోందన్నారు. దానిని త‌ట్టుకునే శ‌క్తి ఏ పార్టీకి లేద‌న్నారు.

రాష్ట్రంలో బీజేపీ అంత‌కంత‌కూ బ‌ల‌ప‌డుతోంద‌ని, దానిని టీఆర్ఎస్ శ్రేణులు జీర్ణించు కోలేక పోతున్నాయ‌ని ఎద్దేవా చేశారు త‌రుణ్ చుగ్(Tarun Chugh). రాష్ట్ర పార్టీ చీఫ్ బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్ చేప‌ట్టిన పాద‌యాత్రకు భారీ ఎత్తున స్పంద‌న ల‌భిస్తోంద‌ని చెప్పారు.

రైతులు, బాధితులు త‌మ గోడు వెళ్ల బోసుకుంటున్నార‌ని అన్నారు. ఏక‌ప‌క్ష కుటుంబ పాల‌న వ‌ల్ల తాము తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని, బీజేపీయే గులాబీకి ప్ర‌త్యామ్నాయం అంటున్నార‌ని చెప్పారు త‌రుణ్ చుగ్.

ఇక నుంచి రాష్ట్రంలో ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ఏక‌రువు పెట్టాల‌ని, టీఆర్ఎస్ స‌ర్కార్ ను నిద్ర పోకుండా చేయాల‌ని స్ప‌ష్టం చేశారు.

పార్టీ కార్య‌క‌ర్త‌లు, శ్రేణులు, నాయ‌కులు, ప‌దాధికారులు, బాధ్యులు క‌ష్ట‌ప‌డి ప‌ని చేయాల‌ని పిలుపునిచ్చారు. రాబోయే రాజ్యం మ‌న‌దేన‌ని చెప్పారు త‌రుణ్ చుగ్.

Also Read : పెరిగిన అంత‌రం మోదీ టూర్ కు దూరం

Leave A Reply

Your Email Id will not be published!