Gyanvapi Survey Case : వారం లోగా అఫిడ‌విట్ దాఖ‌లు చేయాలి

జ్ఞాన్ వాపి మ‌సీదు స‌ర్వే కేసుపై కోర్టు

Gyanvapi Survey Case : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం క‌లిగించిన యూపీలోని వార‌ణాసి జ్ఞాన్ వాపి మ‌సీదు స‌ర్వే కేసుపై ఇవాళ వార‌ణాసి సిటీ కోర్టు విచార‌ణ చేప‌ట్టింది. ఈ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేసింది.

ఇప్ప‌టికే ఈ కేసును భార‌త దేశ స‌ర్వోన్న‌త న్యాయ స్థానం సుప్రీంకోర్టు కింది కోర్టుకు బ‌దిలీ చేస్తూ త్రిస‌భ్య ధ‌ర్మాసనం తీర్పు చెప్పింది. దీంతో ఎలాంటి నిర్ణ‌యం వ‌స్తుందోన‌ని ఉత్కంఠ నెల‌కొంది.

ఈ త‌రుణంలో వారాణాసి సిటీ కోర్టు మంగ‌ళ‌వారం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆదేశించిన‌ట్లుగానే య‌థాత‌థ స్థితి కొన‌సాగిస్తూనే ఇరు వ‌ర్గాల‌కు సంబంధించి పూర్తి వివ‌రాల‌తో వారం రోజుల్లోపు అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని ఆదేశించింది.

ఏది ముందుగా వినాలో నిర్ణ‌యించిన కోర్టు జ్ఞాన్ వాపి మ‌సీదు స‌ర్వేపై(Gyanvapi Survey Case) ఏమైనా అభ్యంత‌రాలు ఉన్న‌ట్ల‌యితే వాటికి సంబంధించిన ఆధారాల‌తో త‌మ ముందు అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని స్ప‌ష్టం చేసింది వార‌ణాసి కోర్టు.

ఇందులో భాగంగా ముస్లిం ప‌క్షం నిర్వ‌హ‌ణ కేసును ముందుగా విచారించాల‌ని కోరింది. ఇందుకు కోర్టు అంగీకారం తెలిపింది.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరేకు జ్ఞాన్ వాపి మ‌సీదు కేసును విచార‌ణ జ‌రుపుతున్న కోర్టు మ‌సీదులో చిత్రీక‌ర‌ణ చ‌ట్ట విరుద్ద‌మంటూ మ‌సీదు క‌మిటీ చేసిన వాద‌న‌ను మొద‌ట వింటామ‌ని స్ప‌ష్టం చేసింది.

ఈ కేసులో విచార‌ణ ప్ర‌క్రియ గురువారం ప్రారంభ‌మ‌వుతుంద‌ని కోర్టు తెలిపింది. 1991 నాటి చ‌ట్టాన్ని ఉల్లంఘించింద‌ని , దేశంలోని ఏ ప్రార్థ‌నా స్థ‌లం పాత్ర‌ను మార్చ కూడ‌ద‌ని మ‌సీదు క‌మిటీ పేర్కొంది.

గ‌త వారం ప్రారంభంలో హిందూ పిటిష‌న‌ర్ల త‌ర‌పు న్యాయ‌వాదులు జ్ఞాన్ వాపి మ‌సీదు(Gyanvapi Survey Case) స‌ముదాయం లోని వీడియోగ్ర‌ఫీ స‌ర్వేలో శివ లింగం ఉన్న‌ట్లు తేలింద‌ని పేర్కొన్నారు. దీంతో వివాదం మ‌రింత ముదిరింది.

Also Read : భ‌గ‌వంత్ మాన్ నిర్ణ‌యం దేశానికి ఆద‌ర్శం

Leave A Reply

Your Email Id will not be published!