Texas School Killed : అమెరికాలో కాల్పుల మోత 21 మంది మృతి
18 మంది చిన్నారులతో పాటు ముగ్గురు, నిందితుడి కాల్చివేత
Texas School Killed : అమెరికాలో కాల్పుల మోత కలకలం రేపింది. ఎక్కడ పడితే అక్కడ కాల్పులకు తెగ బడుతున్నారు దుండగులు. ఈ దారుణ ఘటన ప్రపంచాన్ని ఒక్కసారిగా విస్తు పోయేలా చేసింది.
అభం శుభం తెలియని 18 మంది విద్యార్థులు, మరో ముగ్గురు మృతి చెందారు. కాల్పులకు తెగబడిన నిందితుల్ని కాల్చి పారేశారు. అమెరికాలోని టెక్సాస్(Texas School Killed) లోని ఓ ప్రాథమిక పాఠశాలలో జరిగిన కాల్పుల్లో మొత్తం పిల్లలతో పాటు 21 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇక కాల్పులకు పాల్పడినట్లుగా భావిస్తున్న 18 ఏళ్ల గునం అక్కడికక్కడే మృతి చెందినట్లు టెక్సాస్ పోలీస్ ఉన్నతాధికారి వెల్లడించారు. అమెరికాలో ఎక్కడో ఒక చోట కాల్పుల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
గత కొన్నేళ్లలో ఇలాంటి దారుణమైన ఘటన జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. టెక్సాస్(Texas School Killed) లోని ఉవాల్టేలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇలాంటి ఘటనల్ని కంట్రోల్ చేయడంలో అమెరికా ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది.
టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ 18 ఏళ్ల ముష్కరుడు ఈ దారుణానికి ఒడిగట్టాడంటూ వెల్లడించారు. కాల్పులకు పాల్పడే కంటే ముందు తన అమ్మమ్మను కాల్చి చంపాడు. తన వాహనాన్ని వదిలి పెట్టి తుపాకీతో ప్రవేశించినట్లు భావిస్తున్నారు.
సాల్వడార్ రామోస్ అనే అనుమానితుడు కూడా చని పోయాడు. అత్యంత కిరాతకంగా కాల్చి చంపాడని ఆవేదన వ్యక్తం చేశారు టెక్సాస్ గవర్నర్. ఈ దాడిలో ముగ్గురు పెద్దలు కూడా చనిపోయినట్లు తెలిపారు.
2012లో కనెక్టికట్ లోని శాండీ హుక్ కాల్పుల్లో 20 మంది చిన్నారులు, ఆరుగురు సిబ్బంది మరణించిన తర్వాత జరిగిన రెండో అతి పెద్ద కాల్పుల ఘటన ఇది.
Also Read : యుద్దం విరమిస్తేనే శాంతి సాధ్యం