GT vs RR Qualifier1 : మిల్లర్ విధ్వంసం గుజరాత్ ఘన విజయం
7 వికెట్ల తేడాతో రాజస్థాన్ పరాజయం
GT vs RR Qualifier1 : ఐపీఎల్ 2022లో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్(GT vs RR Qualifier1) జైత్రయాత్ర కొనసాగిస్తోంది.
కోల్ కతా లని ఈడెన్ గార్డెన్ లో జరిగిన ఫస్ట్ క్వాలిఫయిర్ కీలక మ్యాచ్ లో గుజరాత్ రాజస్థాన్ రాయల్స్ జట్టును మరోసారి మట్టి కరిపించింది.
7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. నిలకడైన ఆట తీరుతో ఆకట్టుకుంది. ప్రత్యర్థి జట్టును కట్టడి చేస్తూ గెలుపు స్వంతం
చేసుకుంది. గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో రాజస్థాన్ రాయల్స్ అనుకున్న రీతిలో ఆడ లేక పోయింది.
టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇక మైదానంలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు
కోల్పోయి 188 రన్స్ చేసింది.
ఇక ఆఖరు ఓవర్ లో 16 రన్స్ చేయాల్సి ఉండగా గుజరాత్ స్టార్ హిట్టర్ డేవిడ్ మిల్లర్ కిల్లర్ గా మారాడు. ప్రసిద్ద్ కృష్ణ వేసిన ఓవర్ లో
వరుసగా మూడు సిక్సర్లు కొట్టి విక్టరీ సాధించి పెట్టాడు.
రిచ్ లీగ్ లో తనకు ఎదురే లేదని చాటింది మరోసారి గుజరాత్ టైటాన్స్(GT vs RR Qualifier1). 20 పాయింట్లతో టాప్ లో నిలిచిన ఆ జట్టు
రెండో స్థానంలో ఉన్న రాజస్తాన్ తో పోటీ పడి సత్తా చాటింది.
ఇక ఎలిమినేటర్ విజేతతో శుక్రవారం రాజస్తాన్ రాయల్స్ మరో మ్యాచ్ ఆడనుంది. ఆదివారం 29న జరిగే ఫైనల్ లో ఎలిమినేటర్ లో గెలుపొందిన
జట్టుతో ఆడనుంది గుజరాత్ టైటాన్స్(GT vs RR Qualifier1). ఇక మ్యాచ్ విషయానికి వస్తే రాజస్తాన్ స్టార్ హిట్టర్ బట్లర్ మరోసారి రెచ్చి పోయాడు.
56 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు 2 సిక్సర్లతో 89 రన్స్ చేసి ఆఖరున రనౌట్ గా వెనుదిరిగాడు. కెప్టెన్ సంజూ శాంసన్ 26 బంతుల్లో 5 ఫోర్లు
3 సిక్సర్లతో 47 రన్స్ చేశాడు. పడిక్కల్ 2 ఫోర్లు 3 సిక్సర్లతో 28 రన్స్ చేశాడు.
ఇక జైశ్వాల్ 3, హిట్ మైర్ 4, పరాగ్ 4 కే వెనుదిరిగాగు. గుజరాత్ బౌలర్లలో షమీ, దయాల్ , సాయి కిషోర్ , హార్దిక్ చెరో వికెట్ తీశారు. అనంతరం
బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ 3 వికెట్లు కోల్పోయి 191 రన్స్ చేసి సక్సెస్ సాధించింది.
కెప్టెన్ పాండ్యా 27 బంతులు ఆడి 5 ఫోర్లతో 40 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. శుభ్ మన్ గిల్ 21 బంతులు ఆడి 5 ఫోర్లు ఒక సిక్సర్ తో
35 పరుగులు చేస్తే మాథ్యూ వేడ్ 30 బంతులు ఆడి 35 చేశాడు.
ఇందులో ఆరు ఫోర్లు ఉన్నాయి. ఇక చివర్లో వచ్చిన డేవిడ్ మిల్లర్ చుక్కలు చూపించాడు. 38 బంతులు ఆడి 3 ఫోర్లు 5 సిక్సర్లతో
68 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
Also Read : డేవిడ్ మిల్లర్ షాన్ దార్ కిల్లర్