Sanju Samson IPL 2022 : సంజూ శాంస‌న్ షాన్ దార్ ఇన్నింగ్స్

చాన్నాళ్ల త‌ర్వాత దంచి కొట్టిన స్టార్

Sanju Samson IPL 2022 : ఐపీఎల్ 2022 రిచ్ లీగ్ ఆఖ‌రి అంకానికి చేరింది. ఎలాంటి అంచ‌నాలు లేకుండానే కేర‌ళ స్టార్ సంజూ శాంస‌న్ నేతృత్వంలోని రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఈసారి స‌త్తా చాటింది. లీగ్ మ్యాచ్ లు ఎట్ట‌కేల‌కు ముగిశాయి.

రాజ‌స్తాన్ ఇప్ప‌టి వ‌ర‌కు 14 లీగ్ మ్యాచ్ ల‌లో 9 గెలిచింది. 5 మ్యాచ్ ల‌లో ఓట‌మి పాలైంది. 18 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది.

దీంతో ప్లే ఆఫ్స్ కు గుజ‌రాత్ టైటాన్స్ , రాజ‌స్తాన్ రాయ‌ల్స్ , ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ , రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు వ‌రుస‌గా 1, 2, 3, 4 స్థానాల్లో నిలిచాయి.

ఇక ఐపీఎల్ క్వాలిఫ‌యిర్ -1 మ్యాచ్ కోల్ క‌తా లోని ఈడెన్ మైదానంలో గుజ‌రాత్ టైటాన్స్ , రాజ‌స్తాన్ రాయ‌ల్స్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ కొన‌సాగింది. ఈ మ్యాచ్ ఆఖ‌రి వ‌ర‌కు ఉత్కంఠ‌ను రేపింది. టాస్ గెలిచిన పాండ్యా ముందుగా రాజ‌స్తాన్ కు బ్యాటింగ్ చాన్స్ ఇచ్చాడు.

ఈ త‌రుణంలో మైదానంలోకి దిగిన రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఓపెన‌ర్ య‌శ‌స్వి జైశ్వాల్ కేవ‌లం 3 ప‌రుగులు మాత్ర‌మే చేసి పెవిలియ‌న్ బాట ప‌ట్టాడు.

ఇక ఐపీఎల్ లో ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్న ఇంగ్లండ్ స్టార్ హిట్ట‌ర్, బ్యాట‌ర్ జోస్ బ‌ట్ల‌ర్ ఊహించ‌ని విధంగా త‌న స్టాండ్ మార్చుకున్నాడు.

ప‌వ‌ర్ ప్లే పూర్త‌య్యేంత దాకా కూడా త‌న జోరు పెంచ‌లేదు. ఇక జైశ్వాల్ ఔట్ కావ‌డంతో మైదానంలోకి దిగిన కెప్టెన్ సంజూ శాంస‌న్(Sanju Samson IPL 2022) ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు.

కేవ‌లం 26 బంతులు మాత్ర‌మే ఎదుర్కొని 5 ఫోర్లు 3 సిక్స‌ర్ల‌తో రెచ్చి పోయాడు. 47 ర‌న్స్ చేసి స‌త్తా చాటాడు.

Also Read : జ‌ట్టును ఒడ్డుకు చేర్చిన కెప్టెన్

Leave A Reply

Your Email Id will not be published!