Telangana Career Portal : సమస్తం అర చేతిలో ప్రత్యక్షం
కెరీర్ గైడెన్స్ పోర్టల్ సులభం
Telangana Career Portal : తెలంగాణ పాఠశాల విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుకునే పిల్లలతో పాటు పై చదువులు చదవాలని అనుకునే వారికి మరింత మేలు చేకూర్చేలా పోర్టల్ ను తీసుకు వచ్చింది.
దీని వల్ల ఏం చదవాలో, ఎక్కడ అవకాశాలు ఉంటాయో , కాలేజీలు, కోర్సులు, ఉపకార వేతనాలు ఇలా ప్రతి ఒక్క దానికి సంబంధించి ఇందులో పొందు పరిచారు. దీనికి కెరీర్ గైడెన్స్ పోర్టల్ గా నామకరణం చేశారు.
రాష్ట్రంలో ఎక్కువగా పిల్లలు గ్రామీణ ప్రాంతంలో చదువుకుంటున్నారు. ఎక్కడ చదువు కోవాలనే దానిపై ఇప్పటికీ తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. నెట్టింట్లో ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ సరైన సమాచారం లేక పోవడంతో ఇబ్బంది పడుతున్నారు.
దీనిని దృష్టిలో పెట్టుకుని వేలాది మంది విద్యార్థులకు మేలు చేకూర్చేలా దీనిని అద్భుతమైన సమాచారంతో రూపొందించింది. యూనిసెఫ్ ఇండియా, ఆస్కాన్ ఫౌండేషన్ సంయుక్తంగా తయారు చేశారు ఈ కెరీర్ గైడెన్స్ పోర్టల్ ను(Telangana Career Portal).
ప్రభుత్వ పాఠశాలల్లో 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువు కుంటున్న విద్యార్థుల కోసమే దీనిని రూపొందించినట్లు వెల్లడించి తెలంగాణ పాఠశాల విద్యా శాఖ. విద్యార్థులకు అందుబాటులో ఉన్న కోర్సులు ఏవి.
ఏ కోర్సులు ఎంచుకుంటే ఎలాంటి లాభం ఉంటుంది. కాలేజీలు ఎక్కడ ఉన్నాయి. అక్కడ ఉన్న వసతులు ఏమిటి. పాఠశాలలు, కాలేజీలలో ఎవరెవరు పని చేస్తున్నారు.
వారి హోదా, డిజిగ్నేషన్ , విద్యార్హత విషయాలు ఇందులో పొందు పరిచారు. పై చదువులు చదివేందుకు కావాల్సిన సమాచారంతో పోటు ఉపకార వేతనాలు పొందేందుకు కూడా వీలు కల్పిస్తుంది ఈ పోర్టల్(Telangana Career Portal).
telanganacareerportal.com పై క్లిక్ చేయాలి. ఐడీ, పాస్ వర్డ్ ను జనరేట్ చేసుకుంటే ఇక సమాచారం ప్రత్యక్షం అవుతుంది.
Also Read : హమ్మయ్య నోటిఫికేషన్ విడుదల