KCR & Modi : మోదీ కామెంట్స్ పై కేసీఆర్ ఫైర్
ప్రధానివన్నీ అబద్దాలు అవాస్తవాలు
KCR & Modi : తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలన సాగుతోందని, దానికి చరమ గీతం పాడాలని పిలుపునిచ్చిన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పై నిప్పులు చెరిగారు కేసీఆర్. దేశ వ్యాప్త పర్యటనలో భాగంగా ఆయన మూడో ఫ్రంట్ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు.
ఇప్పటికే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను కలిశారు. అక్కడి నుంచి నేరుగా పంజాబ్ కు వెళ్లాడు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన రైతు ఆందోళనలో ప్రాణాలు కోల్పోయిన 600 మంది రైతులకు ఒక్కొక్కరికీ రూ. 3 లక్షల సాయం అందజేశారు.
అనంతరం కేసీఆర్ హైదరాబాద్ కు విచ్చేశారు. గురువారం బీజేపీకి ప్రత్యామ్నాయంగా మద్దతు కూడగట్టేందుకు కేసీఆర్ కు కర్ణాటకలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా మాజీ ప్రధాన మంత్రి హెచ్ డి దేవెగౌడ, మాజీ సీఎం హెచ్ డి కుమార స్వామితో భేటీ అయ్యారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. మోదీపై సీరియస్ అయ్యారు కేసీఆర్(KCR & Modi). భాషన్ బాజీ మాటల్ని దేశంలో ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరన్నారు కేసీఆర్. 2024 జాతీయ స్థాయి ఎన్నికల్లో కచ్చితంగా బీజేపీకి చుక్కలు చూపించడం ఖాయమన్నారు.
కొద్ది కాలం ఆగితే మీరు మరో సంచలనాన్ని చూస్తారని అన్నారు కేసీఆర్. మోదీ తనను టార్గెట్ చేయడం మాని దేశంలో రైతలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఫోకస్ పెట్టాలన్నారు.
ఓ వైపు ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత రేటు పెరిగితే ఈరోజు వరకు చర్యలు తీసుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు కేసీఆర్(KCR & Modi). రైతులు, దళితులు, గిరిజనులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అన్నారు.
మాజీ పీఎం, సీఎంలతో కలిసి మాట్లాడా. సానుకూల పరిణామాలు చోటు చేసుకున్నాయి. త్వరలో జాతీయ స్థాయిలో మార్పు రావడం ఖాయమన్నారు.
Also Read : కేసీఆర్ పాలన ప్రజాస్వామ్యానికి ప్రమాదం