HD Kumaraswamy : మేమే ప్ర‌త్యామ్నాయం మార్పు అనివార్యం

బీజేపికి మూడో కూట‌మి ప్ర‌త్యామ్నాయం

HD Kumaraswamy : దేశంలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు వేగంగా మార్పు చెందుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కాకుండా మూడో ప్ర‌త్యామ్నాయం వేదిక దిశ‌గా అడుగులు ప‌డుతున్నాయి.

ఇందుకు శ్రీ‌కారం చుట్టారు తెలంగాణ రాష్ట్ర స‌మితి చీఫ్‌, తెలంగాణ సీఎం కేసీఆర్. ఇప్ప‌టికే ఆయ‌న దేశ వ్యాప్తంగా ప‌ర్య‌టిస్తున్నారు. ఢిల్లీ సీఎంను క‌లిశారు. దేశంలో బీజేపీ సంకీర్ణ స‌ర్కార్ ను, ప్ర‌ధాని మోదీని టార్గెట్ చేశారు.

గ‌త కొంత కాలం నుంచీ కేంద్ర ప్ర‌భుత్వ విధానాల‌ను ఎండ‌గడుతూ వ‌స్తున్నారు. భావ సారూప్య‌త క‌లిగిన పార్టీలు, నేత‌లతో క‌లుస్తూ వ‌స్తున్నారు. గురువారం సీఎం కేసీఆర్ క‌ర్ణాట‌క‌లో ప‌ర్య‌టించారు.

బెంగ‌ళూరులో మాజీ పీఎం దేవెగౌడ‌, మాజీ సీఎం హెచ్ డి కుమార స్వామితో(HD Kumaraswamy) భేటీ అయ్యారు. అనంత‌రం సీఎం కేసీఆర్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. త్వ‌ర‌లో దేశంలో సంచ‌ల‌నం జ‌ర‌గ‌బోతుంద‌ని ప్ర‌క‌టించారు.

ఈ సంద‌ర్భంగా మాజీ సీఎం హెచ్ డి కుమార స్వామి(HD Kumaraswamy) మీడియాతో మాట్లాడారు. దేశంలో నెల‌కొన్న ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌తో పాటు రాజ‌కీయ అంశాల‌పై సుదీర్ఘంగా చ‌ర్చించామ‌ని చెప్పారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము ఏర్పాటు చేయ‌బోయే కూట‌మి బీజేపీకి చుక్క‌లు చూపించ‌డం ఖాయ‌మ‌ని జోస్యం చెప్పారు. ఎంద‌రో ప్ర‌ధానులు దేశాన్ని పాలించారు.

త‌రాలు గ‌డిచినా దేశం ప‌రిస్థితి ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే ఉంద‌న్నారు. మోదీ వ‌న్నీ అబ‌ద్దాలు, అవాస్త‌వాలేన‌ని మండిప‌డ్డారు కేసీఆర్.

ఇదిలా ఉండగా భార‌త దేశం కంటే జీడీపీలో ఉన్న చైనా ఇప్పుడు ఆర్థికంగా ప్ర‌పంచాన్ని శాసిస్తోంద‌న్నారు. కానీ మోదీ స‌ర్కార్ మాత్రం 5 ట్రిలియ‌న్ డాల‌ర్ల బిజినెస్ అంటూ ప్ర‌చారం చేస్తోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు.

Also Read : మోదీ కామెంట్స్ పై కేసీఆర్ ఫైర్

Leave A Reply

Your Email Id will not be published!