Faf Du Plessis Qualifer2 : పాఫ్ డుప్లెసిస్ మదిలో ఏముందో
మిస్టర్ పర్ ఫెక్ట్ గా పేరొందిన క్రికెటర్
Faf Du Plessis Qualifer2 : అసలైన యుద్దం మొదలు కానుంది. ఐపీఎల్ 2022 ఫైనల్ పోరు కోసం ఏ జట్టు వస్తుందోనని గుజరాత్ టైటాన్స్ వేచి చూస్తోంది. గుజరాత్ లోని అహ్మదాబాద్ మోదీ స్టేడియం క్వాలిఫయిర్ -2 మ్యాచ్ కోసం సిద్దమైంది.
గుజరాత్ తో ఓడి పోయిన రాజస్తాన్ రాయల్స్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించు కోనుంది. 2008 తర్వాత టైటిల్ గెలిచిన రాజస్తాన్ ఇప్పటి వరకు ప్లే ఆఫ్స్ కు చేరింది లేదు.
సంజూ శాంసన్ కు ఇది అగ్ని పరీక్ష. ఇక విరాట్ కోహ్లీ సారథ్యంలో ఆర్సీబీ టైటిల్ గెలవలేదు. కానీ అనుకోని రీతిలో ఢిల్లీ క్యాపిటల్స్ రూపంలో అదృష్టం కలిసి వచ్చింది ఆ జట్టుకు. ముంబై ఇండియన్స్ ఓడించడంతో నేరుగా ప్లే ఆఫ్స్ కు చేరింది.
కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్ లో దుమ్ము రేపింది. బ్యాటింగ్ లో రాణించింది. బౌలింగ్ లో సత్తా చాటింది. 14 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ ను మట్టి కరిపించింది.
కోహ్లీ స్థానంలో పాఫ్ డుప్లెసిస్(Faf Du Plessis Qualifer2) కు పగ్గాలు అప్పగించింది ఆర్సీబీ యాజమాన్యం. దీంతో ఆ జట్టు పడుతూ లేస్తూ వచ్చింది. కానీ అనుకోని రీతిలో అద్బుత విజయాలు సాధించి టైటిల్ గెలుస్తుందనే నమ్మకాన్ని కలిగించిన లక్నోకు చుక్కలు చూపించింది.
ఇంటి బాట పట్టేలా చేసింది. ఇందులో ప్రధానంగా కెప్టెన్ తీసుకున్న నిర్ణయాలే కారణమని చెప్పక తప్పదు. ఇవాళ బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన రాజస్తాన్ రాయల్స్ కు బౌలింగ్ లో దుర్బేధ్యంగా ఉన్న ఆర్సీబీ బౌలింగ్ మధ్య పోరు జరగనుంది.
Also Read : కళ్లన్నీ మిస్టర్ కూల్ పైనే
2018 లో రాజస్థాన్ ప్లేఆఫ్స్ కి చేరింది