Ashok Chandna : ప్లీజ్ మంత్రి పదవి నుంచి తప్పించండి
ఉన్నతాధికారి మితిమీరిన జోక్యంపై ఆగ్రహం
Ashok Chandna : ఆయన ఆ రాష్ట్రానికి మంత్రి. ఈ కాలంలో మినిష్టర్ అంటే హంగు ఆర్భాటం, లెక్కలేనంత సెక్యూరిటీ, మందీ మార్బలం. కానీ అలాంటి కీలకమైన మంత్రి పదవి తనకు వద్దంటూ ఓ మంత్రి ఏకంగా సీఎంకు మొర పెట్టుకున్నాడు.
ప్రస్తుతం ఆ మంత్రి వ్యవహారం దేశాన్ని ఒక్కసారిగా విస్తు పోయేలా చేసింది. దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసిన ఈ ఘటన గుజరాత్ లో చోటు చేసుకుంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రభుత్వం కొలువు తీరింది.
ఆ రాష్ట్రానికి అశోక్ గెహ్లాట్ సీఎంగా ఉన్నారు. ఇక ఈ మంత్రి పదవి వద్దంటూ బహిరంగంగా వేడుకున్న మంత్రి ఎవరంటే బండి నియోజకవర్గం ఎమ్మెల్యే అశోక్ చంద్నా. ఆయన ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు.
తన పరిధిలోని శాఖల్లో ఉన్నాధికారి జోక్యం తట్టుకోలేక పోతున్నానని, వెంటనే తనను తొలగించాలంటూ సీఎం గెహ్లాట్ కు విన్నవించారు చంద్నా. తన శాఖలన్నింటిని అతడికే ఇచ్చేయండంటూ కోరారు.
ఇదిలా ఉండగా అశోక్ చంద్నా ప్రస్తుతం రాజస్థాన్ రాష్ట్ర కేబినెట్ లో క్రీడలు, యువజన వ్యవహారాలు, స్కిల్ డెవలప్ మెంట్, ఉపాధి, ఎంట్రప్రెన్యూర్ షిప్ , డిజాస్టర్ మేనేజ్ మెంట్ అండ్ రిలీఫ్ శాఖలకు మంత్రిగా ఉన్నారు.
గత కొంత కాలం నుంచి సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ కుల్దీప్ రంకా జోక్యం చేసుకుంటున్నారని, వెంటనే ఆ శాఖలను అతడికే అప్పగించమంటూ కోరాడు. ఇక ఈ మంత్రి పదవి తనకు వద్దని, వెంటనే తప్పించమని కోరాడు.
ఏ మాత్రం గౌరవం లేని ఈ పదవి తనకు ఉన్నా లేనట్టేనని మండిపడ్డాడు అశోక్ చంద్నా(Ashok Chandna). మంత్రి చేసిన ఈ కామెంట్స్ రాజస్థాన్ రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి. త్వరలో ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి.
Also Read : తమిళ భాషను జాతీయ భాషగా గుర్తించాలి