Aryan Khan NCB : ఆర్య‌న్ ఖాన్ కు ఎన్సీబీ లైన్ క్లియ‌ర్

త‌గిన సాక్ష్యాధారాలు స‌మ‌ర్పించిన ఎన్సీబీ

Aryan Khan NCB : డ్ర‌గ్స్ ఆన్ క్రూయిజ్ కేసులో బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ త‌న‌యుడు ఆర్య‌న్ ఖాన్(Aryan Khan) తో పాటు మ‌రో ఐదుగ‌రిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) శుక్ర‌వారం క్లియ‌ర్ చేసింది.

గ‌త ఏడాది అక్టోబ‌ర్ లో ముంబైలో ఓ క్రూయిజ్ షిప్ లో డ్ర‌గ్స్ దొర‌క‌డంతో 14 మంది నిందితుల‌ను పేర్కొంటూ ఎన్సీబీ 6,000 పేజీల ఛార్జిషీట్

దాఖ‌లు చేసింది.

అరెస్ట‌యిన ప‌లువురిలో ఒక‌రైన 23 ఏళ్ల ఆర్య‌న్ ఖాన్ ను నిందితుడిగా పేర్కొన‌లేదు. ఆర్య‌న్ , మోహక్ మిన‌హా నిందితులంద‌రూ మాద‌క ద్ర‌వ్యాల‌ను క‌లిగి ఉన్న‌ట్ల గుర్తించారు అని సీనియ‌ర్ ఏన్సీబీ అధికారి సంజ‌య్ కుమార్ సింగ్ వెల్ల‌డించారు.

ఆర్య‌న్ ఖాన్ తో పాటు మ‌రో ఐదుగురికి వ్య‌తిరేకంగా త‌గిన సాక్ష్యాల‌ను ఏజెన్సీ క‌నుగొన లేక పోయింద‌ని పేర్కొన్నారు. అప్ప‌ట్లో షారుఖ్ ఖాన్

త‌న‌యుడు అరెస్ట్ కావ‌డం క‌ల‌క‌లం రేపింది. సోష‌ల్ మీడియాను షేక్ చేసింది.

డ్ర‌గ్స్ కేసులో అరెస్ట్ అయ్యాక ఆర్య‌న్ ఖాన్(Aryan Khan NCB) మూడు వారాల‌కు పైగా జైలు జీవితం గ‌డిపాడు. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో మొద‌ట్లో ఆర్య‌న్ కాన్ మాద‌క ద్ర‌వ్యాల సాధార‌ణ వినియోగారుడిగా, స‌ర‌ఫ‌రా దారుడిగా అభియోగం మోపింది.

ఈ ఆరోప‌ణ‌ల‌ను ఆర్య‌న్ ఖాన్ తో పాటు తంత్రి షారుఖ్ ఖాన్ , ఆయ‌న త‌ర‌పు న్యాయ‌వాదులు తీవ్రంగా కండించారు. దాడి స‌మ‌యంలో

ఆర్య‌న్ ఖాన్ వ‌ద్ద ఎలాంటి డ్ర‌గ్స్ ల‌భించ లేద‌ని స్ప‌ష్టం చేశారు.

ఇందుకు సంబంధించిన సాక్ష్యాల‌ను పొందు ప‌ర్చ‌డంలో విఫ‌ల‌మైంది ఎన్సీబీ. ఎన్సీబీ(NCB) వాదన‌ల‌ను కూడా కేసును

విచారిస్తున్న ప్ర‌త్యేక కోర్టు ప్ర‌శ్నించింది. అటువంటి తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు చేసేందుకు కేవ‌లం వాట్సాప్ సందేశాల‌పై ఆధార ప‌డ‌లేమ‌ని పేర్కొంది.

ఇదిలా ఉండగా ఈ కేసు విచారిస్తున్న అధికారి స‌మీర్ వాంఖ‌డే తొల‌గించ‌బ‌డ్డాడు. ఉద్దేశ పూర్వ‌కంగా ఆర్య‌న్ ఖాన్ ను ల‌క్ష్యంగా చేసుకున్నాడ‌ని, నిందితుల్ని బ్లాక్ మెయిల్ చేసేందుకు ప్ర‌య‌త్నించాడ‌ని విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

దర్యాప్తులో అవకతవకలు మరియు లోపాలు బయటపడిన తర్వాత కేసు కూడా ముంబైకి చెందిన ఎన్‌సిబి బృందం నుండి ఢిల్లీకి చెందిన

బృందానికి బదిలీ చేయబడింది.

Also Read : పొట్టి డ్రెస్ తో ర‌ష్మిక ప‌రేషాన్

Leave A Reply

Your Email Id will not be published!