Arvind Kejriwal LG : క‌లిసి ప‌ని చేయ‌డం ముఖ్యం – సీఎం

ఢిల్లీ ఎల్జీ స‌క్సేనాను క‌లిసిన కేజ్రీవాల్

Arvind Kejriwal LG : ఢిల్లీ కొత్త లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ విన‌య్ కుమార్ స‌క్సేనాతో ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ మొద‌టి సారి స‌మావేశం అయ్యారు. శుక్ర‌వారం ఆయ‌న నివాసంలో మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లుసుకున్నారు.

ఈ సంద‌ర్భంగా సీఎం, ఎల్జీ స‌క్సేనాల మ‌ధ్య దాదాపు 40 నిమిషాల‌కు పైగా భేటీ జ‌రిగింది. ఎల్జీతో స‌మావేశం ముగిసిన అనంత‌రం సీఎం అర‌వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal LG)  ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

గ‌తంలో ఎల్జీ, ఆప్ స‌ర్కార్ కు మ‌ధ్య తీవ్ర అగాధం ఏర్ప‌డింది. కానీ ప్ర‌స్తుతం కొత్త ఎల్జీతో స‌మావేశం ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో జ‌రిగింద‌న్నారు సీఎం.

ఈ సంద‌ర్భంగా లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్, ఢిల్లీ ప్ర‌భుత్వం క‌లిసి ప‌ని చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు అర‌వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal LG) . ఇదే విష‌యాన్ని తాము ఎల్జీకి స్ప‌ష్టం చేయ‌డం జ‌రిగింద‌న్నారు.

ఇప్ప‌టికే ఎన్నో స‌మ‌స్య‌లు పేరుకుని పోయాయి. కొన్ని అంశాలు ఎల్జీ ప‌రిధిలో ఉన్నాయి. చాలా వాటికి ప‌రిష్కారం దొర‌క‌డం లేదు. ఈ బండి న‌డ‌వాలంటే ప్ర‌భుత్వం లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ మ‌ధ్య స‌మ‌న్వ‌యం ఉండ‌టం చాలా ముఖ్య‌మ‌న్నారు సీఎం.

ఢిల్లీ అభివృద్ధికి ఇద్ద‌రం క‌లిసి ప‌ని చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు అర‌వింద్ కేజ్రీవాల్. ఇదిలా ఉండ‌గా మాజీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ బైజ‌ల్ ను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు.

అంత‌కు ముందు ఆయ‌న త‌మ విధుల్లో జోక్యం చేసుకున్నారంటూ ఆరోపించారు. ప్ర‌స్తుత ఎల్జీ కూడా ప్ర‌జ‌ల‌కు మంచి చేయాల‌ని తాను కోరుకుంటున్న‌ట్లు తెలిపారు అర‌వింద్ కేజ్రీవాల్.

ఇదిలా ఉండ‌గా కేంద్రం వ‌ర్సెస్ ఢిల్లీ స‌ర్కార్ మ‌ధ్య ఆధిప‌త్య పోరు కొన‌సాగుతోంది.

Also Read : న‌వాబ్ మాలిక్ చెప్పిందే జ‌రిగింది

Leave A Reply

Your Email Id will not be published!