Donald Trump : ర‌క్షించుకునేందుకు గ‌న్స్ అవ‌స‌రం

సంచ‌ల‌న కామెంట్స్ చేసిన డొనాల్డ్ ట్రంప్

Donald Trump : టెక్సాన్ ఘ‌ట‌న‌పై యావ‌త్ ప్ర‌పంచం విస్తు పోతుంటే అమెరికా దేశ మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేస్తూ ఆశ్చ‌ర్య పోయేలా చేశారు.

నేష‌న‌ల్ రైఫిల్ అసోసియేష‌న్ (ఎన్ఆర్ఏ) ఈవెంట్ లో క‌ఠిన‌మైన తుపాకీయ నియంత్ర‌ణ ను ట్రంప్ త‌ప్పు ప‌ట్టారు. చ‌ట్టాన్ని గౌర‌వించే పౌరుల‌ను ఆయుధం చేసేందుకు ఇది అవ‌స‌ర‌మ‌న్నారు.

టెక్సాస్ స్కూల్ మార‌ణ‌కాండ త‌ర్వాత తుపాకీ నియంత్ర‌ణ‌ల‌ను మ‌రింత క‌ఠిన‌త‌రం, క‌ట్టుదిట్టం చేయాల‌నే పిలుపును అమెరికా మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) తిర‌స్క‌రించారు.

చెడు నుండి తమ‌ను తాము ర‌క్షించుకునేందుకు అవ‌స‌ర‌మైన తుపాకీల‌ను అనుమ‌తించాల‌ని కోరారు. మ‌న ప్ర‌పంచంలో చెడు ఉనికి చ‌ట్టాన్ని గౌర‌వించే పౌరుల‌ను నిరాయుధ‌ల‌ను చేసేందుకు కార‌ణం కాద‌న్నారు.

ఇదిలా ఉండ‌గా డొనాల్డ్ ట్రంప్ నేష‌న‌ల్ రైఫిల్ అసోసియేష‌న్ లో స‌భ్యుడిగా ఉన్నారు. ఇదిలా ఉండ‌గా గ‌న్ క‌ల్చ‌ర్ అన్న‌ది ఓ వ్య‌స‌నంగా మారింది అమెరికాలో. వేల కోట్ల రూపాయ‌ల వ్యాపారం జ‌రుగుతోంది.

ఎవ‌రిపై నియంత్ర‌ణ లేకుండా పోతోంది. ఇందుకు సంబంధించి చ‌ట్టాన్ని తీసుకు రావాలని బైడెన్ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నం చేసినా దాని వెనుక ఉన్న శ‌క్తులు అడ్డు ప‌డుతున్నాయి.

హ్యూస్ట‌న్ లో జ‌రిగిన ఎన్ఆర్ఏ ఈవెంట్ లో ట్రంప్(Donald Trump) ఈ వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం ట్రంప్ చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.
మ‌న‌ల్ని మ‌నం ర‌క్షించు కోవ‌డానికి తుపాకులు అవ‌స‌ర‌మ‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : ఉగ్ర‌వాదంపై ఉమ్మ‌డి పోరు సాగించాలి

Leave A Reply

Your Email Id will not be published!