PM Modi : మోదీ ప్రభుత్వ పాలనకు జనామోదం
కరోనా మహమ్మారి సమయంలో భేష్
PM Modi : వచ్చే సార్వత్రిక ఎన్నికలలో మరోసారి దేశ వ్యాప్తంగా కాషాయ జెండా ఎగుర వేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్న భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ(PM Modi) కి ఒక రకంగా గుడ్ న్యూస్ అని చెప్పక తప్పదు.
ఓ వైపు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరాభారం, ప్రభుత్వ ఆస్తుల అమ్మకం, నిత్యావసరాల ధరలకు రెక్కలు రావడంపై పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీశాయి.
మోదీ ప్రభుత్వ పనితీరుపై కొంత అసహనం వ్యక్తం అవుతున్న వేళ తాజా సర్వే ఆయనకు అనుకూలంగా రావడం విశేషం. జాతీయ సంస్థ బ్లూమ్ బెర్గ్ చేసిన సర్వేలో మోదీ ప్రభుత్వ పనితీరుపై 64 వేల మందితో అభిప్రాయలు సేకరించింది.
67 శాతం మంది కరోనా మహమ్మారిని రెండోసారి ఎదుర్కోవడంలో ప్రధాని మోదీ(PM Modi) ప్రభుత్వం విజయవంతమైందని తెలిపారు. అయినప్పటికీ అత్యధికంగా వస్తువుల ధరలు, నిరుద్యోగంపై మాత్రం ఇంకా ఆందోళన కొనసాగుతుందని సర్వే ద్వారా స్పష్టమైంది.
2020లో 62 శాతం ఉండగా 2021లో 51 శాతంగా ఉండింది. ఇక కరోనా థర్డ్ వేవ్ ను ఎదుర్కోవడంలో ప్రభుత్వం సిద్దంగా ఉందని, ఆర్థిక వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించిందన్న అభిప్రాయాన్ని సర్వేలో పాల్గొన్న వారు వ్యక్తం చేశారు.
ఇక 47 శాతం మంది ప్రభుత్వం సమస్యను పరిష్కరించ లేక పోయిందని వాపోయారు. 37 శాతం ఆమోదంతో నిరుద్యోగిత నిర్వహణపై విశ్వాసం కూడా పెరిగిందని బ్లూమ్ బెర్గ్ తెలిపింది.
వలస కార్మికులు ఆయా నగరాల్లో తమ ఉద్యోగాలను కోల్పోయారని, వారిలో అసహనం ఉందనేది వెల్లడైంది. రిటైల్ ద్రవ్యోల్బణం ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయికి చేరుకోవడంతో దిద్దుబాటు చర్యలకు దిగింది మోదీ సర్కార్. గోధుమలు, చక్కెర ఎగుమతులపై నిషేధం విధించింది.
Also Read : దేశాన్ని తల ఎత్తుకునేలా చేశా