UP Minister : దేవుళ్ల వ‌ల్లే భార‌త దేశానికి గుర్తింపు

యూపీ మంత్రి ల‌క్ష్మి నారాయ‌ణ్ చౌద‌రి

UP Minister : ఉత్త‌ర ప్ర‌దేశ్ కు చెందిన చెరకు అభివృద్ది శాఖ మంత్రి ల‌క్ష్మి నారాయ‌ణ్ చౌద‌రి(UP Minister) సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. దేవుళ్ల వ‌ల్ల‌నే భార‌త దేశం ఇవాళ ప్ర‌పంచంలో టాప్ లో నిలిచింద‌న్నారు.

ప్ర‌స్తుతం గ్లోబల్ ప‌వ‌ర్ హౌస్ గా మారింద‌ని జోస్యం చెప్పారు. అయోధ్య శ్రీ‌రాముని జ‌న్మ స్థ‌లం. మ‌ధుర శ్రీ‌కృష్ణ‌ను పుట్టిన ప్రాంతం. కాశీ (వార‌ణాసి) ని శివుడు సృష్టించాడ‌ని ఆయ‌న అన్నారు.

ఈ ముగ్గురు దేవుళ్ల కార‌ణంగా భార‌త దేశం అత్యంత శ‌క్తివంత‌మైన దేశంగా నిలిచింద‌న్నారు. ఈ దేవుళ్ల ఆశీర్వాదం, మ‌ద్ద‌తు కార‌ణంగానే భారత్ ప్ర‌పంచ శ‌క్తి కేంద్రంగా త‌యారైంద‌ని చెప్పారు.

సోమ‌వారం మంత్రి ల‌క్ష్మి నారాయణ్ చౌద‌రి మాట్లాడారు. వార‌ణాసి లోని జ్ఞాన్ వాపి మ‌సీదు కేసు , మ‌థుర లోని షాహీ ఈద్గాపై జ్యూరీ ఇంకా నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉండ‌గా ఆయ‌న చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపాయి.

దేవుళ్లు ఎప్ప‌టికీ భార‌త్ కు అండ‌గా నిలుస్తార‌ని అన్నారు. ఏదైనా ప్ర‌భుత్వం , సంఘం లేదా సంస్థ ఈ దేవ‌త‌ల‌కు సంబంధించిన స్థ‌లాల‌ను అందంగా చేయాల‌ని అనుకుంటే ఎవ‌రికీ ఎటువంటి అభ్యంత‌రాలు ఉండ‌వ‌ని ల‌క్ష్మీ నారాయ‌ణ్ చౌద‌రి(UP Minister) స్ప‌ష్టం చేశారు.

అస‌లు అలాంటి అంశాల ప‌ట్ల ఎందుకు అభ్యంత‌రం చెబుతారంటూ ఎదురు ప్ర‌శ్న వేశారు మంత్రి. శ్రీ‌రాముడు, శ్రీ‌కృష్ణ‌డు, శివుడు కార‌ణంగానే భార‌త దేశానికి గుర్తింపు వ‌చ్చింద‌న్నారు.

వారి కార‌ణంగానే ఖ్యాతి నెల‌కొంద‌న్నారు. ఆయ‌న భార‌త దేశాన్ని ఓ విశ్వ గురుగా అభివ‌ర్ణించారు. ఇవాళ ప్ర‌పంచం మొత్తం శ్రీ‌కృష్ణుడి గీత‌ను చ‌దువుతోంది.

ఆద‌ర్శ కుమారుడు, ఆద‌ర్శ భ‌ర్త‌, ఆద‌ర్శ సోద‌రుడు, ఆద‌ర్శ సోద‌రుడు , స్నేహితుడు ఎలా ఉండాల‌నే దాని గురించి రాముడి సందేశాన్ని అందిస్తోంద‌న్నారు.

800-850 ఏళ్లుగా నిర్వీర్య‌మై పోయిన భార‌తీయ సంస్కృతిని భ‌ద్ర ప‌ర్చేందుకు ఇప్పుడు ఒక అవ‌కాశం ద‌క్కింద‌న్నారు.

Also Read : మోదీ ప్ర‌భుత్వ పాల‌న‌కు జ‌నామోదం

Leave A Reply

Your Email Id will not be published!