Sidhu Murder : పంజాబ్ పోలీసులకు అప్పగించొద్దు
కోర్టుకు గ్యాంగ్ లీడర్ లారెన్స్ బిష్ణోయ్
Sidhu Murder : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పంజాబ్ గాయకుడు సిద్దూ మూసే వాలా కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
ఇప్పటికే ఈ ఘటనపై జ్యూడిషియల్ ఎంక్వయిరీకి ఆదేశించారు సీఎం భగవంత్ మాన్. 424 మంది ప్రముఖులకు సెక్యూరిటీ తొలగిస్తున్నట్లు ప్రకటించిన ఒక రోజు తర్వాత సిద్దూను కాల్చి చంపారు దుండగులు.
ఇటీవల పంజాబ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దూ మూసే వాలా సిద్దూ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాన్సా నుంచి పోటీ చేసి
విజయ్ సింగ్లా చేతిలో ఓడి పోయాడు.
8 లేదా 10 మందితో కూడిన గ్యాంగ్ విచక్షణా రహితంగా కాల్పులకు పాల్పడ్డారు. ఏకంగా 30 సార్లు కాల్చినట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి
కెనడా గ్యాంగ్ స్టర్ తానే బాధ్యత వహిస్తున్నట్లు ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడం కలకలం రేపింది.
సిద్దూ(Sidhu Murder) ఘటనలో కీలక వ్యక్తిగా భావిస్తున్న గ్యాంగ్ లీడర్ లారెన్స బిష్ణోయ్ వేరే కేసులో ఢిల్లీలోని తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే తనను ఎట్టి పరిస్థితుల్లో పంజాబ్ పోలీసులకు అప్పగించ వద్దంటూ కోర్టును ఆశ్రయించాడు.
కఠినమైన మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్ క్రైమ్ యాక్ట్ కింద వ్యవస్థీకృత నేరాల కేసులో ఢిల్లీలోని తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. బెయిల్ మంజూరు చేసేందుకు కఠినమైన షరతులు ఉన్నాయి.
ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టుకు తన పిటిషన్ లో లారెన్స్ బిష్ణోయ్ తనను పంజాబ్ పోలీస్ కు అప్పగించవద్దని కోరారు. తనను
ఎన్ కౌంటర్ లో లేపేస్తారని భవపడుతున్నాడని సమాచారం.
కెనడాలో నివసిస్తున్న లారెన్స్ ముఠా సభ్యుడు గోల్డీ బ్రార్ ఆదివారం సిద్దూ(Sidhu Murder)ను తామే చంపానని పోస్ట్ చేశాడు. గోల్డీ బ్రార్
తీహార్ జైలులో ఒకరితో టచ్ లో ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
సంయుక్త ఆపరేషన్ లో ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ నుంచి ఒక కీలక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. యాత్రికుల మధ్యలో దాక్కున్న అతడిని పట్టుకున్నారు. అతడితో పాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read : ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి అరెస్ట్