Hardik Pandya : వరల్డ్ కప్ అందుకోవాలన్నది కల
వెల్లడించిన గుజరాత్ కెప్టెన్ పాండ్యా
Hardik Pandya : ఐపీఎల్ 2022 టైటిల్ ను గెలుచుకున్న గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నాయకుడిగా జట్టును ముందుండి నడిపించాడు. ఫైనల్ లో రాజస్తాన్ రాయల్స్ ను 7 వికెట్ల తేడాతో ఓడించి మట్టి కరిపించాడు.
గతంలో హార్దిక్ పాండ్యా(Hardik Pandya) ముంబై ఇండియన్స్ తరపున ప్రాతినిధ్యం వహించాడు. కీలకంగా మారాడు. దుబాయ్ వేదికగా 2021లో జరిగిన ఐపీఎల్ 14వ సీజన్ లో పాండ్యా రాణించ లేక పోయాడు.
మరో వైపు గాయాల బారిన పడడం కూడా జాతీయ జట్టుకు ఎంపిక కాలేదు. ఒక రకంగా చెప్పాలంటే 2020, 2021 అతడి కెరీర్ లో తీరని అసంతృప్తిని మిగిల్చిందనే చెప్పాలి.
కానీ ఐపీఎల్ 2022 మాత్రం హార్దిక్ పాండ్యా(Hardik Pandya) కు అద్భుతమైన అవకాశం దక్కింది గుజరాత్ టైటాన్స్ రూపంలో. ఆ జట్టు యాజమాన్యం కొత్తగా చేరింది ఐపీఎల్ లో.
ఈ ఏడాది ఫిబ్రవరి 12, 13 తేదీలలో బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో హార్దిక్ పాండ్యాను ఏరి కోరి ఎంచుకుంది. ఈ నిర్ణయాన్ని చూసి అంతా విస్తు పోయారు.
పేలవమైన ఆట తీరుతో తీవ్ర నిరాశ పరిచిన ఆటగాడిని ఎంచుకోవడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ జట్టు మేనేజ్ మెంట్ కోచ్ గా ఆశిష్ నెహ్రా, మెంటార్ గా గ్యారీ కిరిస్టెన్ ను ఎంపిక చేసింది.
ఈ ముగ్గురూ కలిసి ఐపీఎల్ లో చరిత్ర సృష్టించారు. విజేతగా నిలిపారు గుజరాత్ టైటాన్స్ ను. ఈ సందర్భంగా పాండ్యా మాట్లాడుతూ తన కెరీర్ లో ఇదో మరిచి పోలేని జ్ఞాపకంగా మిగిలి పోతుందన్నాడు.
అదే సమయంలో వరల్డ్ కప్ అందుకోవడం అన్నది తన కల అని చెప్పాడు.
Also Read : చరిత్ర సృష్టించిన మోదీ స్టేడియం