Anil Deshmukh : అనిల్ దేశ్ ముఖ్ బెయిల్ పై విచారించండి

బాంబే హైకోర్టును ఆదేశించిన సుప్రీంకోర్టు

Anil Deshmukh : సుప్రీంకోర్టు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. మ‌నీ లాండ‌రింగ్ కేసులో మ‌హారాష్ట్ర మాజీ హోం శాఖ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ దాఖ‌లు చేసుకున్న బెయిల్ పిటిష‌న్ ను త్వ‌ర‌గా విచారించాల‌ని బాంబే హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది.

ముంద‌స్తు విచార‌ణ కోసం హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేయాల‌ని మాజీ మంత్రిని స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం స్ప‌ష్టం చేసింది.

ప్ర‌స్తుతం జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీలో ఉన్నారు సీనియ‌ర్ నేష‌న‌లిస్టు కాంగ్రెస పార్టీ (ఎన్సీపీ) నాయ‌కుడు. తాను గత మార్చి 25 నుండి త‌న బెయిల్ పిటిష‌న్ ను హైకోర్టులో తీసుకోలేద‌ని సుప్రీంకోర్టుకు విన్న‌వించారు.

దీని కోసం హైకోర్టులోనే ద‌ర‌ఖాస్తు చేయాల్సి ఉంటుంద‌ని పేర్కొంది. పెండింగ్ లో ఉన్న అనిల్ దేశ్ ముఖ్(Anil Deshmukh) పిటిష‌న్ పై ముందస్తు విచార‌ణ జ‌ర‌పాల‌ని కోరింది.

గ‌త వారం అనిల్ దేశ్ ముఖ్(Anil Deshmukh) కు అధిక ర‌క్త పోటుకు గుర‌య్యారు. ఛాతీ నొప్పి వ‌స్తోంద‌ని ఫిర్యాదు చేయ‌డంతో ఆయ‌న‌ను ముంబై లోని సివిక ర‌న్ కెఇఎం హాస్పిట‌ల్ లోని ఐసీయూలో చేర్చారు.

ఇదిలా ఉండ‌గా 72 ఏళ్ల మాజీ మంత్రిని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) న‌వంబ‌ర్ 2021లో రూ. 100 కోట్ల దోపిడీ , మనీ లాండ‌రింగ్ కేసుకు సంబంధించి అరెస్ట్ చేసింది.

సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్ (సీబీఐ) కేసు న‌మోదు చేయ‌డంలో ఈడీ రంగంలోకి దిగింది. ఇదిలా ఉండ‌గా ముంబై మాజీ పోలీసు క‌మిష‌న‌ర్ ప‌ర‌మ్ బీర్ సింగ్ త‌న‌పై అవినీతి ఆరోప‌ణ‌లు చేయ‌డంతో ఎన్సీపీ నాయ‌కుడు హోం మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశారు.

రెండు రోజుల త‌ర్వాత సీబీఐ కేసు న‌మోదు చేసింది.

Also Read : ముస్లింల‌కు బీజేపీ రిక్త హ‌స్తం

Leave A Reply

Your Email Id will not be published!