Tejashwi Yadav : లాలూ రాజ‌కీయ వార‌సుడు తేజ‌స్వినే

పార్టీలో ఎమ్మెల్యేలు, నేత‌ల తీర్మానం

Tejashwi Yadav : రాష్ట్రీయ జ‌న‌తా ద‌ళ్ లో ఆధిప‌త్య పోరుకు ముగింపు ప‌లికింది ఆ పార్టీ. ఈ మేర‌కు లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ అస‌లైన రాజ‌కీయ వార‌సుడు తేజ‌స్వి యాద‌వ్ అంటూ తీర్మానం చేసింది.

ఈ మేర‌కు పార్టీకి సంబంధించిన కీల‌క నిర్ణ‌యాలు ఆయ‌నే తీసుకుంటార‌ని వెల్ల‌డించింది. ప్ర‌స్తుతమే కాదు భ‌విష్య‌త్తులో కూడా తీసుకునే ఏ నిర్ణ‌యానికైనా తాము మ‌ద్ద‌తు ఇస్తామ‌ని పార్టీకి చెందిన స‌భ్యులు , నేత‌లు ప్ర‌క‌టించారు.

తేజ‌స్వి యాద‌వ్(Tejashwi Yadav) సోద‌రుడు తేజ్ ప్ర‌తాప్ యాద‌వ్ మ‌ధ్య ఆధిప‌త్య పోరు న‌డుస్తోంది. ఈ త‌రుణంలో పార్టీకి పెద్ద దెబ్బ ప‌డే ప్ర‌మాదం ఉంద‌ని ఆందోళ‌నలో ప‌డ్డారు పార్టీ శ్రేణులు.

ఇందులో భాగంగా పార్టీ జాతీయ ఎజెండాపై నిర్ణ‌యం తీసుకునే అధికారం తేజ‌స్వికే అప్ప‌గించింది. ఆర్జేడీ నాయ‌కులు, ఎమ్మెల్యేలు ఆమోదించిన తీర్మానంలో తేజ‌స్వి యాద‌వ్(Tejashwi Yadav) (32) భ‌విష్య‌త్తులో అన్ని విధాన ప‌ర‌మైన నిర్ణ‌యాల‌ను తీసుకుంటార‌ని పేర్కొంది.

రాష్ట్రంలో కుల ప్రాతిప‌దిక‌న జ‌నాభా గ‌ణ‌న‌పై అఖిల‌ప‌క్ష స‌మావేశానికి ముందు పార్టీ చేప‌ట్టిన ముఖ్య‌మైన ఎత్తుగ‌డ ఇది.

తేజ్ యాద‌వ్ తో పాటు బీహార్ మాజ సీఎంలు లాలూ యాద‌వ్ , స‌తీమ‌ణి ర‌బ్రీ దేవి, కూతురు ఎంపీ మిసా భార‌తి, పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాద‌వ్ హాజ‌ర‌య్యారు.

లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ అధ్య‌క్ష‌త‌న ఆర్జేడీ లెజిస్లేచ‌ర్ పార్టీ స‌మావేశంలో తీర్మానాన్ని ఆమోదించారు. ఇక రాజ్య‌స‌భ లేదా ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల ఎంపిక‌ను తేజ‌స్వి చేస్తారంటూ తెలిపారు. ప్ర‌స్తుతానికి సంక్షోభం ముగిసింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Also Read : కాంగ్రెస్ కు బ్రిజేష్ కాల‌ప్ప గుడ్ బై

Leave A Reply

Your Email Id will not be published!