CM Yogi : అయోధ్యలో గర్భగుడి పనులకు శ్రీకారం
రామాలయంలో శంకుస్థాపన చేసిన సీఎం
CM Yogi : దేశ వ్యాప్తంగా ఉత్కంఠకు దారి తీసిన దేవాలయం ఏదైనా ఉందంటే అది యూపీలోని అయోధ్య రామాలయం. దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తోంది.
రెండో దశ పనుల్లో భాగంగా రామాలయానికి సంబంధించిన గర్భ గుడి పనులకు శ్రీకారం చుట్టారు యూపీ సీఎం యోగి(CM Yogi) ఆదిత్యానాథ్ . మొదటి దశ పనుల్లో భాగంగా రామ మందిర నిర్మాణంలో ప్లాట్ ఫామ్ ను చేపట్టారు.
రెండో దశ కింద గర్భ గృహాన్ని నిర్మించారు. ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చేపట్టారు బుధవారం సీఎం. ఇదిలా ఉండగా ఆలయ నిర్మాణ పనులను అయోధ్య రామ మందిర నిర్మాణ కమటీ చైర్మన్ నిపేంద్ర మిశ్రా ఆధ్వర్యంలో జరుగుతున్నాయి.
కాగా ఆలయ నిర్మాణంలో కీలకమైన పనులను ప్రారంభించినట్లు చెప్పారు. కాగా ఈ రెండో దశ పనులను మూడు దశలుగా చేపడతామని తెలిపారు. వచ్చే ఏడాది 2023 లోగా ఈ నిర్మాణం పనులు పూర్తి చేస్తామన్నారు.
ఇక మొత్తం అయోధ్య లోని రామాలయ గుడి నిర్మాణం 2024 నాటికి పూర్తి అవుతుందని ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదని పేర్కొన్నారు మిశ్రా.
మరో వైపు ప్రతిష్టాత్మకంగా ఆలయ కాంప్లెక్స్ (భవన నిర్మాణ సముదాయం ) ను వచ్చే 2025 లోగా పూర్తి చేస్తామని ప్రకటించారు .ఈ సందర్భంగా సీఎం యోగి(CM Yogi) మాట్లాడారు.
ఇక అయోధ్య రామ మందిరం జాతీయ చిహ్నంగా, ఆలయంగా మారుతుందని అన్నారు. ఈ రోజు కోసం దేశ ప్రజలు ఎంతో ఉత్కంఠతో వేచి చూస్తున్నారని చెప్పారు.
భారతీయ ఐక్యతకు రామ మందిరం ఐకాన్ గా నిలుస్తుందన్నారు సీఎం. రెండు సంవత్సరాల కిందట పీఎం పూజలు చేశారని, ఇవాళ ఆచరణలో నిలుస్తోందన్నారు.
Also Read : లాలూ రాజకీయ వారసుడు తేజస్వినే