Rohit Sharma : వచ్చే సీజన్ లో సత్తా చాటుతాం
ముంబై ఇండియన్స్ కెప్టెన్
Rohit Sharma : ఐపీఎల్ 2022 ముగిసింది. హార్దిక్ పాండ్యా సారథ్యం లోని గుజరాత్ టైటాన్స్ రాజస్తాన్ రాయల్స్ ను ఓడించి టైటిల్ ఎగరేసుకు పోయింది.
కాగా టైటిల్ ఫేవరేట్ గా ఉన్న హిట్ మ్యాన్ రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ ఈసారి 9వ స్థానానికే పరిమితమైంది. 10 వ స్థానంలో ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది.
ఆ జట్టు ఏ కోశాన పోటీ ఇవ్వలేక పోయింది. కీలక మ్యాచ్ లలో చాప చుట్టేసింది. విచిత్రం ఏమిటంటే ఆఖరి మ్యాచ్ లో ప్లే ఆఫ్స్ కు చేరుకోవాలని ఆశలు పెట్టుకున్న రిషబ్ పంత్ కెప్టెన్సీ లోని ఢిల్లీ క్యాపిటల్స్ కు చుక్కలు చూపించింది.
ఆ జట్టు పై విజయాన్ని సాధించింది. కానీ కనీసం ప్లే ఆఫ్స్ కు కూడా చేరుకోలేక పోయింది ముంబై ఇండియన్స్ . ఇప్పటి వరకు 15 సీజన్లు ఐపీఎల్ జరిగింది.
అత్యధిక సార్లు టైటిల్ గెలుచుకుని చరిత్ర సృష్టించింది ముంబై. కానీ 2021 సీజన్ లో, 2022 సీజన్ లో అత్యంత పేలవమైన ప్రదర్శన చేసింది. కానీ జట్టులో ఒకరు ఇద్దరు మాత్రమే రాణించారు.
ప్రధానంగా తెలంగాణ కుర్రాడు తిలక్ వర్మ సత్తా చాటాడు. ఆ జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన అన్ క్యాప్డ్ ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. ఇషాన్ కిషన్ కూడా ఆడాడు.
ఇక జట్టుకు నాయకత్వం వహింస్తున్న రోహిత్ శర్మ (Rohit Sharma) ఏకోశాన జట్టును గట్టెక్కించ లేక పోగా తిరిగి ముంబై ఇండియన్స్ కు భారంగా మారాడు. పూర్తి పేలవమైన ఆట తీరుతో నిరాశ పరిచాడు.
తాజాగా మనోవడు ఓ ఛానల్ తో మాట్లాడుతూ సీజన్ ముగిసింది. మా వాళ్లు బాగా ఆడారు. వచ్చే ఐపీఎల్ 16వ సీజన్ లో సత్తా చాటుతామంటూ ధీమా వ్యక్తం చేశాడు రోహిత్ శర్మ(Rohit Sharma).
Also Read : ఎలా సాయం చేయగలనని ఆలోచిస్తున్నా