BCCI IPL Women : మహిళల ఐపీఎల్ పై బీసీసీఐ ఫోకస్
ముగిసిన మెన్స్ ఐపీఎల్ 2022 సీజన్
BCCI IPL Women : ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం కలిగిన క్రీడా సంస్థలలో భారత క్రికెట నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒకటి. ఇక
రిచ్ లీగ్ లలో ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్ ) ఒకటి. ఇప్పటి వరకు 2008లో ప్రారంభించిన బీసీసీఐ ఇప్పటి వరకు 15 సీజన్లు సమర్థవంతంగా నిర్వహించింది.
దీనిని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చేపడుతోంది. తాజాగా ఐపీఎల్ పురుషుల కాంపిటీషన్ ముగియడంతో బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ ఎట్టి పరిస్థితుల్లో మహిళల ఐపీఎల్(BCCI IPL Women) చేపట్టాలని డిసైడ్ అయ్యాడు.
ఈ మేరకు ప్లాన్ కూడా చేశారు. ఇందుకు సంబంధించి విధి విధానాలు కూడా ఖరారు చేశారు. పురుషుల ఐపీఎల్ లో ఉన్న జట్ల యాజమాన్యాలే మహిళల జట్లను కూడా చేజిక్కించు కుంటాయని టాక్.
కాగా మొత్తం మహిళల ఐపీఎల్ లో ఆరు జట్లు ఉండనున్నాయని సమాచారం. తాజాగా బీసీసీఐ మహిళల ఐపీఎల్(BCCI IPL Women) కు
సంబంధించి వాటాదారులతో చర్చలు కూడా జరిపారు.
దీనిని అతి పెద్ద ఈవెంట్ గా నిర్వహించాలన్నది గంగూలీ కల. ఇప్పటికే ఆరు జట్లతో తప్పనిసరిగా రిచ్ లీగ్ జరిగి తీరుతుందంటూ దాదా, జేషా ప్రకటించారు కూడా. ఐపీఎల్ ఫైనల్ సమయంలో దీనికి సంబంధించి మీటింగ్ జరగింది.
రెండు విండోల కోసం గ్రీన్ సిగ్నల్ పొందాల్సి ఉంది. ఒకటి మార్చి ఏప్రిల్ లో, రెండోది సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో . ఈ మేరకు
ఐసీసీని కూడా సంప్రదిస్తామని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
వచ్చే ఏడాదిలో మేలో పురుషుల ఐపీఎల్ ఉంటే , దాని తర్వాత మహిళల ఐపీఎల్ ఉండే అవకాశం ఉంది. బెన్ స్టోక్స్ , హర్మన్ ప్రీత్ కౌర్,
సుజీ బేట్స్ , పూనమ్ రౌత్, స్మృతి మంధాన, హీథర్ నైట్ వంటి క్రికెట్లు ఈ ఐపీఎల్ భావనకు పూర్తి మద్దతు తెలిపారు.
దీంతో మహిళల ఐపీఎల్ నిర్వహించాలని అభిమానులు కూడా కోరుతున్నారు. తాజాగా బీసీసీఐ మహిళల టీ20 ఛాలెంజ్ ను నిర్వహించింది.
ట్రైల్ బ్లేజర్స్ , సూపర్ నోవాస్ రెండు జట్లతో మే 22, 2018 న ప్రారంభించింది.
Also Read : వచ్చే సీజన్ లో సత్తా చాటుతాం