Arvind kejriwal : మ‌నీష్ సిసోడియాను అరెస్ట్ చేసే చాన్స్ – సీఎం

అనుమానం వ్య‌క్తం చేసిన అర‌వింద్ కేజ్ర‌వాల్

Arvind kejriwal : ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఇప్ప‌టికే నిరాధార ఆరోప‌ణ‌ల‌తో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి స‌త్యేంద్ర జైన్ ను ఈడీ అదుపులోకి తీసుకుంది.

ఆయ‌న‌పై మ‌నీ లాండ‌రింగ్ కేసు కింద అరెస్ట్ చేసింది. కోర్టులో హాజ‌రు ప‌ర్చ‌డంతో ఈనెల 9 వ‌ర‌కు క‌స్ట‌డీ లోకి తీసుకుంది. ఈ త‌రుణంలో కేంద్ర స‌ర్కార్ ఢిల్లీ ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేసిందంటూ మొద‌టి నుంచీ ఆరోప‌ణ‌లు చేస్తూ వ‌స్తున్నారు సీఎం కేజ్రీవాల్.

తాజాగా మ‌రో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. స‌త్యేంద్ర జైన్ ను అదుపులోకి తీసుకునేలా చేసిన కేంద్రం త‌మ ప్ర‌భుత్వంలో కీల‌కంగా ఉంటూ , స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేస్తున్న డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియాను అరెస్ట్ చేయ‌నున్నార‌ని, ఈ విష‌యం త‌న‌కు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా తెలిసింద‌ని చెప్పారు.

అవినీతి ఆరోప‌ణ‌ల‌పై మ‌నీష్ సిసోడియాను అరెస్ట్ చేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం సిద్దం అవుతోంద‌ని ఆరోపించారు. ప్ర‌స్తుతం ఎన్నిక‌లు జ‌రుగుతున్న సంద‌ర్భంలో మ‌నీష్ సిసోడియా, స‌త్యేంద్ర జైన్  ల‌ను ఇరికించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని మండిప‌డ్డారు అర‌వింద్ కేజ్రీవాల్(Arvind kejriwal).

ఢిల్లీలో గురువారం సీఎం మాట్లాడారు. జైన్ త‌ర్వాత అరెస్ట్ అయ్యే త‌దుప‌రి జాబితాలో సిసోడియా ఉంటార‌ని త‌న‌కు అనుమానం క‌లుగుతోంద‌న్నారు. ఆయ‌న వీడియో సందేశం వినిపించారు.

ప్ర‌ధాని మోదీకి విన్న‌విస్తున్నా. మ‌మ్మ‌ల్ని అంద‌రినీ జైలులో వేస్తే స‌రిపోతుంద‌న్నారు. త్వ‌ర‌లో అత‌డిని అరెస్ట్ చేయ‌నున్న‌ట్లు త‌న‌కు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా తెలిసింద‌న్నారు.

ఇదే స‌మ‌యంలో సిసోడియాపై న‌కిలీ కేసులు న‌మోదు చేయాల‌ని కేంద్రం అన్ని ఏజెన్సీల‌ను ఆదేశించిందంటూ ఆరోపించారు.

Also Read : ఎమ్మెల్యేలు జారి పోకుండా కాంగ్రెస్ ఫోక‌స్

Leave A Reply

Your Email Id will not be published!