Uttarakhand CM Win : చంపావత్ ఉప ఎన్నికలో సీఎం విక్టరీ
55,000 ఓట్ల తేడాతో ధామీ ఘన విజయం
Uttarakhand CM Win : హమ్మయ్య ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఊపిరి పీల్చుకున్నారు. విచిత్రం ఏమిటంటే ఇటీవల రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో(Uttarakhand CM Win) భారతీయ జనతా పార్టీ ఘన విజయాన్ని నమోదు చేసింది.
తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ హై కమాండ్ మరోసారి సీఎంగా ఛాన్స్ ఇచ్చింది. కానీ ఊహించని రీతిలో సీఎంను ఓడించారు. దీంతో పార్టీతో పాటు ధామీ కూడా ఖంగుతిన్నారు.
ప్రజలు ఇలాంటి తీర్పు ఇస్తారని అనుకోలేదు. కాగా ముఖ్యమంత్రిగా కొలువు తీరినా తిరిగి ఎమ్మెల్యేగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.
తాజాగా రాష్ట్రంలోని చంపావత్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఏకంగా 55,000 వేల ఓట్ల భారీ తేడాతో విజయం(Uttarakhand CM Win) సాధించారు.
ఇక ఆయన నిశ్చింతగా సీఎంగా కొనసాగవచ్చు. గతంలో కూడా సీఎంగా కొనసాగారు పుష్కర్ సింగ్ ధామీ. గత ఫిబ్రవరి – మార్చి నెలలో జరిగిన ఎన్నికల్లో ఖతిమా నియోజకవర్గం నుంచి పోటీ చేశారు సీఎం.
అక్కడ ఓడి పోవడంతో ఇప్పుడు గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. సీఎంగా కొనసాగేందుకు ఉన్న ప్రధాన అడ్డంకి తొలగి పోవడంతో సంతోషానికి లోనయ్యారు పుష్కర్ సింగ్ ధామీ.
ఖతిమాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేతిలో ఓడి పోయారు సీఎం. ఈ సందర్భంగా గెలుపొందాక ధామీ ట్వీట్ చేశారు. చంపావత్ నియోజకవర్గంలో తనను గెలిపించినందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని తెలిపారు.
గతంలో ఎన్నడూ లేని రీతిలో నా హృదయం ఉద్వేగానికి లోనైందని పేర్కొన్నారు. ఇక చంపావత్ లో కాంగ్రెస్ నుంచి నిర్మలా, సమాజ్ వాది పార్టీకి చెందిన మనోజ్ కుమార్ బరిలో ఉన్నారు.
Also Read : పౌరసత్వ సవరణ చట్టం అమలు చేయం – సీఎం