Rajyasabha Elections : పెద్ద‌ల స‌భ‌కు 41 మంది ఏక‌గ్రీవం

రాజ్య‌స‌భ ఎన్నిక‌ల ఫ‌లితం

Rajyasabha Elections : దేశంలోని 15 రాష్ట్రాల‌లో ఖాళీగా ఉన్న 57 రాజ్య‌స‌భ(Rajyasabha Elections) స్థానాల‌లో 41 మంది అభ్య‌ర్థులు ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. భార‌తీయ జ‌న‌తా పార్టీ నుంచి 14 మంది రాజ్య‌స‌భ ఎంపీలుగా ఎన్నిక కాగా కాంగ్రెస్ పార్టీ, వైఎస్సార్సీపీ నుంచి న‌లుగురు చొప్పున ఎన్నిక‌య్యారు.

ఇక కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి కోలుకోలేని షాక్ ఇచ్చిన ప్ర‌ముఖ న్యాయ‌వాది క‌పిల్ సిబ‌ల్ ఇండిపెండెంట్ అభ్య‌ర్థిగా ఎన్నిక‌య్యారు. ఆయ‌న‌కు

యూపీ నుంచి స‌మాజ్ వాది పార్టీ మ‌ద్ద‌తు ల‌భించింది.

ఆ పార్టీకి ఆయ‌న న్యాయ‌వాదిగా ఉన్నారు. ఇక 57 స్థానాల‌కు గాను 41 మంది ఏక‌గ్రీవంగా ఎన్నిక కావ‌డంతో మిగ‌తా 16 మంది ఎన్నిక‌కు

సంబంధించి ఈనెల 10వ తేదీన ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి మ‌రోసారి ఎన్నిక‌య్యారు ఆ పార్టీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ కేంద్ర మంత్రి, న్యాయ‌వాది పి. చిదంబ‌రం. రాజీవ్ శుక్లా కూడా ఆ పార్టీ నుంచి ఎన్నిక‌య్యారు.

బీజేపీ నుంచి సుమిత్రా వాల్మికి , క‌వితా పాటిదార్ , ఆర్జేడీ నుంచి మీసా భార‌తి, ఆర్ఎల్డీ నుంచి జ‌యంత్ చౌద‌రి ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. వీరంతా ఎన్నికైన‌ట్లు రాజ్య‌స‌భ వెల్ల‌డించింది.

ఎన్నికైన(Rajyasabha Elections) వారంద‌రిలో రాష్ట్రాల వారీగా చూస్తే అత్య‌ధికంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ నుంచి 11 మంది, త‌మిళ‌నాడు నుంచి ఆరుగురు,

బీహార్ నుంచి ఐదుగురు, ఏపీ నుంచి న‌లుగురు, ఎంపీ నుంచి ముగ్గురు, ఒడిశా నుంచి ముగ్గురు, చ‌త్తీస్ గ‌ఢ్ నుంచి ఇద్ద‌రు, పంజాబ్ నుంచి

ఇద్ద‌రు, తెలంగాణ నుంచి ఇద్ద‌రు, జార్ఖండ్ నుంచి ఇద్ద‌రు, ఉత్త‌రాఖండ్ నుంచి ఒక‌రు చొప్పున ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు.

త‌మిళ‌నాడు నుంచి ముగ్గురు ఎన్నిక‌య్యారు. ఆప్ , ఆర్జేడీ, టీఆర్ఎస్ నుంచి ఇద్ద‌రు చొప్పున ఎన్నిక‌య్యారు. ఇక మిగిలిన 16 సీట్ల‌కు సంబంధించి మ‌హారాష్ట్ర‌లో 6 స్థానాలు, రాజ‌స్థాన్ లో 4, క‌ర్నాట‌క‌లో 4, హ‌రియాణాలో 2 సీట్ల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

Also Read : చంపావ‌త్ ఉప ఎన్నిక‌లో సీఎం విక్ట‌రీ

Leave A Reply

Your Email Id will not be published!