PM Modi : ప్రపంచం చూపు భారత దేశం వైపు – మోదీ
దేశాభివృద్ధికి ఉత్తర ప్రదేశ్ ఊతం
PM Modi : యావత్ ప్రపంచం భారత దేశం వైపు చూస్తోందని అన్నారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. దేశాభివృద్ధికి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఒక పునాదిగా మారిందని చెప్పారు.
యూపీలో రూ. 80 వేల కోట్ల విలువైన 1,406 ప్రాజెక్టులకు మోదీ(PM Modi) శంకుస్థాపన చేశారు. లోకంలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఉందని చెప్పారు. తమ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన డిజిటలైజేషన్ వరల్డ్ లో టాప్ లో కొనసాగుతోందన్నారు.
గతంలో పాలకులు తమ స్వలాభం కోసం చూసుకున్నారని కానీ తాము అధికారంలోకి వచ్చాక సామాన్యులే ఎజెండాగా పని చేస్తున్నామని అన్నారు మోదీ. లోక్నోలో జరిగిన మూడో పెట్టుబడిదారుల సదస్సును ఉద్దేశించి ప్రసంగించారు ప్రధాన మంత్రి.
తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఎనెన్నో కొత్త దారులు తెరిచిందన్నారు. దీని వల్ల ఎందరికో ఉపాధి అవకాశాలు దక్కుతున్నాయని చెప్పారు మోదీ(PM Modi). భారతీయుల శక్తి సామర్థ్యాల్ని యావత్ ప్రపంచం గుర్తిండమే కాదు ప్రశంసిస్తోందన్నారు.
ఇక ప్రపంచాన్ని శాసిస్తున్న అత్యధిక కంపెనీలను నడుపుతున్న వారిలో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారని ఇది మన దేశానికి గర్వ కారణమన్నారు ప్రధాన మంత్రి.
రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే నెంబర్ వన్ గా భారత్ మారుతుందనడంలో సందేహం లేదన్నారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు మోదీ.
జి-20 ఆర్థిక వ్యవస్థలో భారత్ ముందంజలో ఉందన్నారు. గ్లోబల్ రిటైల్ సూచికలో రెండో ప్లేస్ లో నిలిచిందని చెప్పారు. చమురు, విద్యుత్, గ్యాస్ ను ఉపయోగించుకునే దేశాల్లో టాప్ 3లో ఉందని వెల్లడించారు.
84 బిలియన్ డాలర్లు పెట్టుబడులు వచ్చాయని, 417 బిలియన్ డాలర్లకు పైగా ఉత్పత్తులను ఎగుమతి చేశామన్నారు.
Also Read : పెద్దల సభకు 41 మంది ఏకగ్రీవం