India Slams Pakistan : కాశ్మీర్ కాల్పుల వెనుక పాకిస్తాన్ హ‌స్తం

నిప్పులు చెరిగిన భార‌త స‌ర్కార్

India Slams Pakistan : కాశ్మీర్ లో వ‌రుస కాల్పుల వెనుక దాయాది పాకిస్తాన్ కుట్ర దాగి ఉంద‌ని భార‌త ప్ర‌భుత్వం ఆరోపించింది. ఒక్క వారం రోజుల వ్య‌వ‌ధిలో ప‌లువురు కాల్పుల‌కు గుర‌య్యారు.

కుల్గాం జిల్లాలో ఓ టీచ‌ర్, కాశ్మీరీ పండిట్ , బ్యాంక్ మేనేజ‌ర్, బీహార్ కు చెందిన వ‌ల‌స కార్మికుడు టెర్ర‌రిస్టుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు.

దీనిపై సీరియ‌స్ గా చ‌ర్చించింది కేంద్ర ప్ర‌భుత్వం. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ఇండియ‌న్ ఆర్మీ చీఫ్‌, జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్ తో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు.

శ‌నివారం ఉద‌యం అనంతనాగ్ జిల్లాల్లో భారీ ఎన్ కౌంట‌ర్ జ‌రిగింది. హిజ్బుల్ క‌మాండ‌ర్ ను ఖ‌తం చేసింది ఆర్మీ. ఇదే స‌మ‌యంలో కాశ్మీర్ లో వ‌రుస కాల్పుల వెనుక పాకిస్తాన్ ప్రమేయం ఉంద‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టింది.

ఈ అత్యవ‌స‌ర భేటీలో భార‌త్ కు చెందిన ఉన్న‌త స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా హాజ‌రు కావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

అయితే కాశ్మీర్ లో హింస స్థాయి పెరిగి ఉండ‌వ‌చ్చు. కానీ ఇది జిహాద్ కాదు. కొన్ని నిరాశ జ‌న‌క శ‌క్తులు క‌లిసి చేస్తున్న దాడులుగానే చూస్తోంది కేంద్రం.

ఈ కాల్పులు, హ‌త్య‌ల వెనుక పాకిస్తాన్ ఉంద‌ని ఆరోపిస్తోంది భార‌త్. ఇదిలా ఉండ‌గా తాము ఇక్క‌డ ఉండ‌లేమ‌ని త‌మ‌ను వేరే ప్రాంతానికి త‌ర‌లించాల‌ని కోరుతున్నారు కాశ్మీరీ వాసులు.

కాశ్మీర్ లో ప్ర‌ధానంగా మైనార్టీ క‌మ్యూనిటీ , స్థానికేత‌రుల‌ను ల‌క్ష్యంగా చేసుకుని హ‌త్య‌లు జ‌రిగాయి. హింస‌కు పాల్ప‌డుతున్న వారంతా పాకిస్తాన్(India Slams Pakistan) సరిహ‌ద్దు వెంట ఉన్న వారేన‌ని ఆరోపించింది. కాశ్మీర్ లోయ‌లో తాలిబ‌న్లు ఉన్నార‌నేది అవాస్త‌వమ‌ని పేర్కొంది.

Also Read : అనంతనాగ్ లో హిజ్బుల్ కమాండ‌ర్ హ‌తం

Leave A Reply

Your Email Id will not be published!