Amit Shah : సిద్దూ ఫ్యామిలీకి అమిత్ షా ఓదార్పు
పరామర్శించనున్న కేంద్ర హోం శాఖ మంత్రి
Amit Shah : అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా(Amit Shah) శనివారం దారుణ హత్యకు గురైన పంజాబ్ సింగర్ సిద్దూ కుటుంబాన్ని పరామర్శించనున్నారు.
ఇప్పటికే పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తీవ్ర నిరసనల మధ్య పరామర్శించి ఓదార్చారు. షా రాకతో రాష్ట్ర వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. సిద్దూ స్వంత ఊరులో ఉంటున్న కుటుంబాన్ని పరామర్శించి వారికి భరోసా ఇవ్వనున్నారు అమిత్ చంద్ర షా.
గత వారం కిందట సింగర్ సిద్దూ మూసే వాలాను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. 32 రౌండ్ల పాటు కాల్పులు జరిపారు. సిద్దూతో పాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
సిద్దూ చని పోక ముందు పంజాబ్ ప్రభుత్వం రాష్ట్రంలోని 424 మంది ప్రముఖులకు ఏర్పాటు చేసిన సెక్యూరిటీని తొలగించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తరుణంలో మరుసటి రోజే దుండగులు దారికాచి దారుణంగా కాల్పులకు తెగ బడ్డారు.
ఇదిలా ఉండగా తీహార్ జైలులో ఉన్న గ్యాంగ్ లీడర్ లారెన్స్ బిష్ణోయ్ స్కెచ్ వేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కెనడా కేంద్రంగా ఈ గ్యాంగ్ దాడికి తెగబడ్డారంటూ పంజాబ్ పోలీసులు అనుమానిస్తున్నారు.
ఆయా రాజకీయ పార్టీలు సెక్యూరిటీ తొలగింపుపై మండిపడ్డారు. పంజాబ్, హర్యానా కోర్టు పంజాబ్ సర్కార్ కు నోటీసులు జారీ చేసింది.
చండీగఢ్ లో సింగర్ సిద్దూ మాసే వాలా కుటుంబాన్ని పరామర్శిస్తారు. వారికి అండగా నిలవనున్నారు. కాగా సిద్దూ హత్యకు సంబంధించి కీలక ఆధారాలు లభించాయని ప్రభుత్వం ప్రకటించింది.
Also Read : కాన్పూరులో ఉద్రిక్తత 36 మంది అరెస్ట్