Subramaniyan Swamy : అమిత్ షాకు క్రీడా శాఖ ఇస్తే బెట‌ర్

ఐపీఎల్ పై సుబ్ర‌మ‌ణ్య స్వామి కామెంట్స్

Subramaniyan Swamy : భార‌తీయ జ‌న‌తా పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఎంపీ సుబ్ర‌మ‌ణ్య స్వామి(Subramaniyan Swamy) షాకింగ్ కామెంట్స్ చేశారు. స్వంత పార్టీని, ప్ర‌ధానంగా మోదీ నేతృత్వంలోని ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగారు.

పెట్రోల్, డీజిల్ , గ్యాస్ ధ‌ర‌లు పెంచ‌డాన్ని త‌ప్పు ప‌ట్టారు. ప‌నిలో ప‌నిగా ఆయ‌న కేంద్రంలో చ‌క్రం తిప్పుతూ , ట్రెండ్ సెట్ట‌ర్ గా నిలుస్తూ ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరొందిన కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ షాపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

సుబ్ర‌మ‌ణ్య స్వామి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారితీశాయి. ఆయ‌న ప్ర‌ధానంగా అమిత్ షాను కేంద్రంగా చేసుకుని విమ‌ర్శ‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేగింది.

ఈసారి ముంబై, కోల్ క‌తా, అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ 2022 టోర్నీ పూర్తిగా ఫిక్సింగ్ జ‌రిగిందంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

సుబ్ర‌మ‌ణ్య స్వామి(Subramaniyan Swamy) ఈసారి ఐపీఎల్ , అమిత్ షా, ఆయ‌న కుమారుడు బీసీసీఐ సెక్ర‌ట‌రీ జై షా పై నిప్పులు చెరిగారు. ఐపీఎల్ లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిన‌ట్లు నిఘా సంస్థ‌లు సైతం అనుమానం వ్య‌క్తం చేసిన‌ట్లు ఆరోపించారు.

కేంద్ర హోం మంత్రిని అడ్డం పెట్టుకుని జై షా బీసీసీఐపై ఓ నియంతలా వ్య‌వ‌హ‌రిస్తున్నాడంటూ మండిప‌డ్డారు సుబ్ర‌మ‌ణ్య‌స్వామి. ఈ మ్యాచ్ ఫిక్సింగ్ పై కేంద్ర స‌ర్కార్ ఎలాంటి ద‌ర్యాప్తు చేయ‌ద‌ని ఆరోపించారు.

దీనిపై కోర్టులో ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యాన్ని దాఖలు చేయాల్సిన అవ‌స‌రం ఉందన్నారు. ఇదే స‌మ‌యంలో కాశ్మీర్ లో పండిట్లపై కాల్పులు జ‌ర‌ప‌డాన్ని తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు.

Also Read : అమిత్ షాను క‌లిసిన సిద్దూ పేరెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!