Uddhav Thackeray : కాశ్మీరీ పండిట్లకు అండగా ఉంటాం – ఠాక్రే
సంచలన కామెంట్స్ చేసిన మరాఠా సీఎం
Uddhav Thackeray : కేంద్రంలోని మోదీ సర్కార్ నిర్వాకం కారణంగా కాశ్మీరీ పండిట్లు కాల్పులకు గురవుతున్నారని, వారికి భద్రత లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే(Uddhav Thackeray). ఆయన సంచలన కామెంట్స్ చేశారు.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ప్రధాని మోదీ ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ఉగ్రవాదులు కేవలం కాశ్మీర్ లో పండిట్లను టార్గెట్ చేసుకుని కాల్పులకు పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు.
కాశ్మీర్ నుంచి మహారాష్ట్రకు ఎవరు వచ్చినా తాము వారిని ఆదుకునేందుకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు మరాఠా సీఎం. వారు కన్న కలలు కన్నారు. మరికొందరు ఆ కలలు నిజం కాక పోవడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు.
కాశ్మీర్ లో పరిస్థితిపై సీఎం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మీ అందరికీ తాము భరోసా ఇస్తామన్నారు. ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తామన్నారు. అన్ని విధాలుగా సహాయం చేస్తామని ప్రకటించారు ఉద్దవ్ ఠాక్రా(Uddhav Thackeray).
గత కొన్ని రోజులుగా కాశ్మీరీ పండిట్లు , హిందువులను లక్ష్యంగా చేసుకుని కాశ్మీర్ లోయలో హత్యలు జరుగుతున్నాయి. ఒక నెల వ్యవధిలో 9 మంది కాశ్మీరీ పండిట్లు హత్యకు గురయ్యారు.
వేలాది మంది కాశ్మీరీ పండిట్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వారంతా రోడ్ల మీదకు వచ్చారు. పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు.
దేశం మొత్తం కాశ్మీర్ లోయలో చోటు చేసుకున్న కాల్పులపై తీవ్ర ఆందోళన చెందుతోందని సీఎం పేర్కొన్నారు. ఇదే సమయంలో కాశ్మీరీ పండిట్, పాఠశాల టీచర్, బ్యాంక్ మేనేజర్ , బీహార్ కు చెందిన వలస కూలీని పొట్టన పెట్టుకున్నారు ఉగ్రవాదులు.
Also Read : యోగి ఆదిత్యానాథ్ డైనమిక్ లీడర్ – మోదీ